తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ.. కవిత, జాగృతి నాయకులు ధర్నాకు దిగారు. నాంపల్లిలోని సింగరేణి భవన్ వద్ద రోడ్డుపై బైఠాయించి వారు నినాదాలు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు, మెడికల్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ ప్రతినిధులతో కలిసి ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే వారు భవన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి కవితతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి ముందు కవిత ఆటోలో సింగరేణి భవన్ వద్దకు చేరుకున్నది.