మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ అరెస్ట్..

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసులో మోస్ట్ వాంటెండ్‌గా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..

Update: 2025-11-19 11:57 GMT
Click the Play button to listen to article

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) తమ్ముడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను ఎన్ఐఏ(NIA) అరెస్టు చేసింది. యూఎస్ నుంచి బయలు దేరిన ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తామని NIA అధికారులు తెలిపారు. 2024 ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పులు, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అన్మోల్ నిందితుడు. 2024 నవంబర్‌లో అన్మోల్‌ను అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు మంగళవారం ఆయనను దేశం నుంచి భారత్‌కు పంపించేశారు.


బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడు..

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్(Baba Siddique) 2024 అక్టోబర్ 12వ తేదీన హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా పరిధిలోని తన కుమారుడు జీషాన్ కార్యాలయంలో ఆయనను తుపాకీతో కాల్పి చంపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అన్మోల్ బిష్ణోయ్, శుభం లోంకర్, జిషాన్ మొహమ్మద్ అక్తర్‌ను వాంటెడ్ నిందితులుగా పేర్కొన్నారు.

2022 నుంచి అన్మోల్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ముఠా కోసం అమెరికాలో ఉంటూ అక్కడి నుంచి నేరాలు చేయిస్తు్న్నాడని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News