‘‘ప్రపంచ సేంద్రీయ వ్యవసాయ హబ్ గా మారుతున్నాం’’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
By : The Federal
Update: 2025-11-19 13:33 GMT
ప్రపంచ సేంద్రీయ వ్యవసాయ కేంద్రంగా భారత్ మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కోయంబత్తూర్ లో జరిగిన ‘దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు’లో ఆయన హజరై ప్రసంగించారు.
దేశంలోని యువత వ్యవసాయాన్ని ఆధునిక, లాభదాయకమైన అవకాశంగా చూస్తున్నారని, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రొత్సహాన్ని అందిస్తుందని అన్నారు.
‘‘రాబోయే సంవత్సరాల్లో భారత్ లో అనేక మార్పులు జరగబోతున్నాయి. దేశం సేంద్రీయ వ్యవసాయానికి హబ్ గా మారుతుంది. మన జీవవైవిధ్యం ఫరిడవిల్లుతుంది. దేశంలోని యువత వ్యవసాయాన్ని ఆధునిక, విస్తృత అవకాశాల గనిగా చూస్తున్నారు.
ఇది దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును తెస్తుంది’’ అని మోదీ అన్నారు. ప్రకృతి వ్యవసాయం తన హృదయానికి దగ్గరగా ఉందని చెప్పారు. తమిళనాడు రైతుల ధైర్యానికి, మార్పును అంగీకరించే వారి మనస్తత్వానికి తాను సెల్యూట్ చేస్తున్నానని మోదీ అన్నారు.
‘‘ప్రకృతి వ్యవసాయం నా హృదయానికి దగ్గరగా ఉంది. దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు నిర్వహించినందుకు తమిళనాడు రైతులందరికీ నా శుభాకాంక్షలు.
నాకు అనేక మంది రైతులతో మాట్లాడే అవకాశం లభించింది’’ అని మోదీ అన్నారు. ఎవరో మెకానికల్ ఇంజనీరింగ్, పీహెచ్ డీ చదివి వ్యవసాయం చేస్తున్నారు. ఎవరో నాసా నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. వారు అనేక మందికి శిక్షణ ఇస్తున్నారు.
నేను ఒక విషయాన్ని సభాముఖంగా అంగీకరిస్తున్నాను. ఇక్కడకు రాకపోతే నా జీవితంలో చాలా కోల్పోయేవాడిని. ఈ రోజు ఇక్కడకు రావడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను.
తమిళనాడు రైతుల ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. మార్పును అంగీకరించే వారి బలానికి సెల్యూట్ చేస్తున్నాను’’ అని ప్రధాని మోదీ అన్నారు.
దేశంలోని రైతులకు రూ. 18000 వేల కోట్లను నేరుగా వారి ఖాతాలోకి బదిలీ చేశామని, తమిళనాడులోని లక్షలాది మంది రైతులు పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు అందుకున్నారని మోదీ అన్నారు.
‘‘కొన్ని రోజుల క్రితం మేము పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేశాము. దేశంలోని అన్ని ప్రాంతా లరైతులకు రూ. 18 వేల కోట్లు బదిలీ చేశాము. తమిళనాడు లోని లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి చేరింది’’ అని ప్రధానమంత్రి అన్నారు.