యథావిధిగా విమానాల రాకపోకలు..

విమానయాన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఇక నుంచి షెడ్యూల్ ప్రకారంగానే నడుస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు.;

Update: 2024-07-20 12:22 GMT

విమానయాన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఇక నుంచి షెడ్యూల్ ప్రకారంగానే నడుస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు శనివారం (జూలై 20) తెలిపారు.

నిన్న మైక్రోసాప్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని టెలివిజన్ ఛానెళ్ల ప్రసారం కూడా అగిపోయింది.

200 విమానాలు రద్దు..

దేశీయ మార్కెట్ వాటా ప్రకారం అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. రోజూ 2,000 విమానాలను నడుపుతోంది. సాంకేతిక అంతరాయం కారణంగా దాదాపు 200 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

స్పైస్‌జెట్, అకాసా ఎయిర్‌ లైన్స్ విమానాశ్రయాలలో టిక్కెట్ బుకింగ్‌లతో సహా తమ అన్ని సిస్టమ్‌లు పని చేస్తున్నాయని తెలిపాయి.

"విమానయాన రంగంపై మైక్రోసాఫ్ట్ ఎర్రర్ తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. పరిష్కారం కనుగొన్కాక విమానాలు, టిక్కెట్ బుకింగ్‌లు, కాల్ సెంటర్‌లలో కార్యకాలాపాలు సజావుగా సాగుతున్నాయి’’ అని స్పైస్‌జెట్ తెలిపింది.

ఢిల్లీలో..

ఢిల్లీలోని IGI ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3లో కొన్ని సమస్యలు ఉన్నా.. శనివారం పరిస్థితి మెరుగుపడింది. శుక్రవారం, నాన్-ఫంక్షనల్ సెల్ఫ్-డ్రాప్ బ్యాగేజీ, చెక్-ఇన్ మెషీన్‌ల వల్ల గేట్ నంబర్ 5 వెలుపల పొడవాటి క్యూలు కనిపించాయి. శనివారం ఈ సమస్య తీరిపోయింది.

"నేను అహ్మదాబాద్ వెళ్తున్నాను. ఈ రోజు అంతా బాగానే ఉంది. విమానాలు సమయానికి ఉన్నాయి. నిన్న జరిగింది నెట్‌వర్క్ సమస్య. దాని గురించి ఎవరూ ఏమీ చేయలేరు" అని ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు పేర్కొన్నాడు.

ముంబాయిలో..

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం వారణాసి, కొచ్చికి వెళ్లే రెండు విమానాలను రద్దు చేశారు. అనేక అంతర్జాతీయ విమానాలు రీషెడ్యూల్ చేశారు. శుక్రవారం నుండి తొమ్మిది దేశీయ ఇండిగో విమానాలు రద్దయ్యాయి.

Tags:    

Similar News