లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ముసాయిదా సిద్దం చేస్తున్న మహారాష్ట్ర

డీజీపీ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం;

Update: 2025-02-15 13:31 GMT

దేశంలో ఓ వర్గం మతోన్మాదులు మరో వర్గం ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ కు పాల్పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మోసపూరిత, బలవంతపు మత మార్పిడిలను నిరోధించే లక్ష్యంతో ఒక చట్టాన్ని రూపొందించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) రష్మి శుక్లా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

లవ్ జిహాద్ అంటే..
ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరుతో టార్గెట్ చేసి వివాహాం చేసుకోవడాన్ని ఈ పేరుతో పిలుస్తున్నారు. మతాంతర వివాహాలు, బలవంతపు మార్పిడిల గురించి ప్రస్తుత, మాజీ ప్రతినిధులు ఆందోళనల నేపథ్యంలో ఫడ్నవీస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
చట్టం పరిశీలించాల్సిన..
ప్రభుత్వం ఆలస్యంగా జారీ చేసిన తీర్మానం(జీఆర్) ప్రకారం ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి, లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడిల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది.
ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను సైతం పరిశీలిస్తుంది. దీని ప్రకారం.. బలవంతపు మతమార్పిడిలు, లవ్ జిహాద్ సంఘటనలకు నిరోధించడానికి చట్టాన్ని సిఫార్సు చేస్తుంది.
మహిళా శిశు సంక్షేమం, చట్టం, న్యాయ వ్యవస్థ, మైనారిటీ సంక్షేమం, సామాజిక న్యాయం, హోం, న్యాయ శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
శ్రద్దా వాకర్ హత్యను ఉదహరించిన ప్రభుత్వం..
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మంగళ్ ప్రభాత్ లోధా మాట్లాడుతూ... ‘‘లవ్ జిహాద్ తీవ్రమైన సమస్య, రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు నివారించడానికి కృషి చేస్తోంది.
లవ్ జిహాద్ కేసులను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కమిటీ మహిళల రక్షణ, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం పని చేస్తుంది’’ అని అన్నారు.
ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మహిళా, శిశు అభివృద్ది శాఖ బాధ్యతలు నిర్వర్తించినప్పుడూ, ఇటువంటి సంఘటనలు హైలైట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ కో ఆర్డినేషన్ కమిటీని తాను ఏర్పాటు చేశామని లోధా చెప్పారు.
అలాగే ముంబైలో పరిసరాలలో జరిగిన లవ్ జిహాద్ సంఘటనలపై లోధా మాట్లాడుతూ..‘‘ శ్రద్దా వాకర్ ను అఫ్తాబ్ అమీన్ దారుణంగా హత్య చేశాడు. రూపాలి చందన్ శివేను ఇక్భాల్ షేక్ హత్య చేశాడు.
పూనమ్ క్షీర్ సాగర్ ను నిజాం ఖాన్ హత్య చేశాడు. ఉరాన్ కు చెందిన యశశ్రీ షిండేను దావుద్ హత్య చేశాడు. మలాద్ కు చెందిన సోనమ్ శుక్లా షాజీబ్ అన్సారీ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు’’ అని అన్నారు. ఇన్ని సంఘటనలు జరిగుతున్నప్పుడూ లవ్ జిహాద్ అనే అంశాన్ని ఎలా తోసిపుచ్చగలరని ఆయన ప్రశ్నించారు.
విపక్షాల విమర్శలు..
ప్రభుత్వం లవ్ జిహాద్ పై కమిటీ వేయడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రేమ,వివాహం అనేది వ్యక్తిగతాలని ప్రభుత్వం ఆర్థిక అంశాలపై దృష్టి పెడితే బాగుంటుందని ఎన్సీపీ(ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అన్నారు.
శివసేన(యూబీటీ) ప్రతినిధి సుషమా అందారే, ప్రేమికుల దినోత్సవం నాడు ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని ప్రశ్నించారు. ఇది సరైన సమయం కాదన్నారు.
రాడికలైజేషన్ కు వ్యతిరేకంగా..
అన్ని మతాంతర వివాహాలు లవ్ జిహాద్ గా పరిగణించబడవని ఎన్సీపీ కి చెందిన మహేశ్ అన్నారు. ఇటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మతం పేరుతో జరిగే తీవ్రవాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ముసాయిదా మా ముందుకు వచ్చినప్పుడూ, మేము దానిని అధ్యయనం చేసి మా వైఖరిని తెలిజేస్తామని మహేశ్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాలక మహాయుతి కూటమి గతంలో లవ్ జిహాద్ అంశాన్ని ప్రస్తావించింది.
ఫడ్నవీస్ వాదన..
మహారాష్ట్రలోని 48 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 14 నియోజకవర్గాల్లో బలవంతపు మత మార్పిడిలు జరిగాయని అప్పటి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఈ అంశం ముందుకు పోలేదు. అయితే కొత్తగా ఏర్పడిన కమిటీ ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను అధ్యయనం చేసి, మహారాష్ట్రకు తగిన చట్టాలను సిఫార్సు చేస్తుందని భావిస్తున్నారు. దాని నివేదికను సమర్పించడానకి గడువు నిర్ణయించలేదు.
Tags:    

Similar News