‘ఇకపై మంత్రులే చెల్లించాలి’
మంత్రుల జీతాలు, ఇతర అలవెన్సులపై రాష్ట్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
By : The Federal
Update: 2024-06-25 12:14 GMT
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ జీతాలు, అలవెన్సులపై ఆదాయపు పన్నును మంత్రులే చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేంది.
మంత్రుల జీతాలు, ప్రోత్సాహకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లింపు -1972 నిబంధనను కొట్టివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఆ భారాన్ని మోయదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సూచనను రాష్ట్ర అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కైలాష్ విజయవర్గీయ కేబినెట్ సమావేశంలో గుర్తుచేశారు.