యశోద ఆసుపత్రికి కవిత.. ఆలస్యానికి కారణాలివేనా..?
కేటీఆర్‌తో తనకున్న కయ్యానికే పెద్దపీట వేసే ఆమె గురువారం ఆసుపత్రికి రాలేదా..!;
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. శుక్రవారం ఉదయం ఆమె యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే గురువారం సాయంత్రం కాస్తంత నల్తగా అనిపించడంతో కేసీఆర్.. ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. కంగారు పడాల్సింది ఏమీ లేదన్నారు. ‘‘కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఈ సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు.
అయితే కవిత.. గురువారం సాయంత్రం కేసీఆర్‌ను కలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన దేవుడు అని చెప్పుకునే కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటికీ కవిత అక్కడకు వెళ్లకపోవడంపై అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల కవిత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్‌కు కవితకు మధ్య విభేదాలు ఉన్నాయి అన్న అంశం దాదాపు స్పష్టం అయింది. ఈ క్రమంలోనే తండ్రికి అనారోగ్యం చేసినా అక్కడకు కవిత వెళ్లకపోవడం కీలకంగా మారింది. యశోద ఆసుపత్రికి కేసీఆర్‌తో కలిసి కేటీఆర్ కూడా వెళ్లారు. కేటీఆర్ ఉన్నారన్న కారణంగానే కవిత.. గురువారం సాయంత్రం ఆసుపత్రికి చేరుకోలేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే మరసటి రోజు శుక్రవారం ఆమె ఒంటరిగా ఆసుపత్రికి వచ్చి కేసీఆర్‌ను పలకరించారన్న వాదన వినిపిస్తోంది.
కవితకు కేసీఆర్ కన్నా కయ్యమే ముఖ్యమా..!
తన దేవుడు, స్ఫూర్తి.. కేసీఆర్ అని చెప్పుకునే కవిత.. ఆయన ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో చేరితే మాత్రం ఎక్కడా కనిపించకపోవడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదు.. చూద్దాం అన్న ఆలోచన కవితలో కనిపించలేదని, కేటీఆర్‌తో తనకున్న కయ్యానికే పెద్దపీట వేసే ఆమె గురువారం ఆసుపత్రికి రాలేదని వారు అభిప్రాయపడుతున్నారు. తన దేవుడు కేసీఆర్ అని మాటల్లో తప్పితే ఆయనకు ఆ ప్రాధాన్యత ఇవ్వడంలేదని, తండ్రికన్నా కేటీఆర్‌తో ఉన్న విరోధం, విభేదమే ముఖ్యమన్నట్లు కవిత వైఖరి ఉందని వారు అంటున్నారు. బీఆర్ఎస్ నాది అని గంఠాపథంగా చెప్తున్న కవిత.. ఆ బీఆర్ఎస్‌ను స్థాపించిన, ఆ పార్టీ అధ్యక్షుడు, తండ్రి కేసీఆర్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అని కూడా విశ్లేషకులు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.