మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు సజీవ దహనం
రెండు లారీలు ఢీ కొట్టడంతో క్యాబిన్లో మంటలు;
మహబూబా బాద్ జిల్లాలో పొద్దు పొద్దుగాల ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్నాయి. ఎదురురెదురుగా వచ్చే రెండు లారీలు ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరగగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లోనే ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ చనిపోయాడు. తెల్లవారు జామున దాదాపు మూడున్నరగంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది.
ఒక లారీ చేపల దానా లోడుతో విజయవాడ నుంచి గుజరాత్ బయలు దేరితే మరో లారీ వరంగల్ నుంచి ఎపి వైపు గ్రయినేడు లోడుతో వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది. మరిపెడలో జరిగిన ఈ ప్రమాదం వల్ల ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందగానే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. డ్రైవర్ క్యాబిన్ లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ మంటలకు అహుతి అయ్యారు. కాలిన శవాలను పోలీసులు గుర్తు పట్టలేకపోతున్నారు.కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ మరిపెడ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అహుతి కావడం కలకలం రేపింది.