ఒడిషా: ఎన్నికల వేళ రంగులు మార్చుతున్న నాయకులు

ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఒడిషాలో జోరందుకున్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారో అర్థం కావట్లేదు. పార్టీ చేరిన గంటలు, రోజుల వ్యవధిలోనే పార్టీ టికెట్లు..

Update: 2024-04-10 06:24 GMT

ప్రజలు ప్రతి నాయకుడిని జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకుని ఓటు వేస్తారు. అయితే ఒడిషాలో రాజకీయ నాయకులు, తమ ప్రత్యర్థులను సైన్ అప్ చేయడం ద్వారా గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. చూసేవారికి ఫుట్ బాల్ ఆట గుర్తుకు వచ్చేలా. ఈ విధానాన్ని ప్రజలు అసహ్యహించుకుంటున్నారు.

ఎన్నికలకు కేవలం నెల మాత్రమే ఉంది - మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో ఒడిశాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ అయితే ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇవన్నీ పక్కన పెడితే సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఒకరిని మరొకరు బలహీనపరుచుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. అందుకోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ప్రత్యర్థి శిబిరం నుంచి వీలైనంత మందిని ఎలా తీసుకురావాలనే అంశంపైనే ఇరు పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. ఇందులో చిన్నా పెద్ద నాయకులు అంటూ భేదం ఉండట్లేదు. స్థాయి ఏదైన పార్టీలు మారడమే పరమావధిగా రాజకీయాలు సాగుతున్నాయి.
ఈ తరహ రాజకీయాలు తరచుగా జరుగుతున్నాయి. ఎవరు పార్టీని విడిచిపెట్టారు ఏ పార్టీలో చేరారు అనే లెక్కలు తీయం కష్టం.కానీ, డజన్ల కొద్దీ నాయకులు వారి స్వంత అనుచరులతో ఇప్పటికే రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలలో ఒకదానిని విడిచిపెట్టి మరొక దాంట్లో చేరారు. చేరుతున్నారు. కొత్తవారికి కండువా కప్పి స్వాగతం పలికేందుకు ఆయా పార్టీల నాయకులు గ్రాండ్ షోలు నిర్వహిస్తున్నారు.
ఈ తరహ ఆయారాం, గయారాం రాజకీయాలు ఒడిషా రాష్ట్రానికి కొత్త. ఇక్కడ జనాలకు ఇవి హస్యాస్పదంగా ఉంది. ఇలాంటి రాజకీయాలు ఒడిషాలో స్వతంత్ర్యనికి పూర్వం అంటే 1937 లో జరిగాయి. అప్పట్లో జరిగిన ప్రావిన్సు ఎన్నికల్లో జాజ్ పూర్ జిల్లా కు చెందిన కాంగ్రెస్ ప్రతినిధి బీరా కిషోర్ బెహెరా ఇలా పలు రాజకీయా పార్టీల్లో చేరారు. ఇలా ఆయన పార్టీలు మారే సంస్కృతికి బీజం వేశారు. ఇప్పుడు మాత్రం అవి తారాస్థాయికి చేరాయనే చెప్పుకోవచ్చు. 
అవకాశవాద రాజకీయాలు
అవకాశవాదం ఇప్పటికి పుంజుకుంది. ఉదాహరణకు మాజీ బీజేపీ అధికార ప్రతినిధి లేఖా సమత్‌సింగ్‌ విషయమే తీసుకోండి. బీజేపీలో ఉన్నప్పుడు బీజేడీని ఎన్నిరకాలుగా విమర్శించాలో అన్నిరకాలుగా చేశారు. అయితే ఓ రోజు హఠాత్తుగా లేఖా సింగ్ బీజేడీలో చేరారు. తనకు నవీన్ పట్నాయక్ తనకు ఆదర్శమని కొనియాడారు. ఇప్పుడు లేఖను బీజేడీ అభ్యర్థిగా నిలబెట్టే అంశాలను పరిశీలిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయడానికి దాదాపు పది వేల దరఖాస్తులు వచ్చాయని బీజేడీ పేర్కొంది. కానీ వాళ్లందరిని పక్కన పెట్టి పక్క పార్టీ నుంచి వారికి పెద్ద పీఠ వేస్తున్నారు.
రివార్డింగ్ పార్టీ హాపర్స్
BJD లోక్‌సభ అభ్యర్థులలో కనీసం నలుగురు BJP నుంచి వచ్చారు అందులో భృగు బుక్సిపాత్రోతో సహా, పార్టీ మారిన కొన్ని గంటల్లోనే బెర్హంపూర్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయడానికి BJD టిక్కెట్ అందుకున్నారు. ఈయనకు ప్రత్యర్థిగా ఒకప్పుడు పట్నాయక్ ను నమ్మిన బంటుగా ఉన్న ప్రదీప్ పాణిగ్రాహిని బీజేపీ తనలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది.
బీజేపీ కూడా ఇలా ప్రతిపక్ష పార్టీలోని నాయకులను ఆకర్షించడంలో ముందుంది. వారికే ప్రాధాన్యం ఇస్తూ టికెట్లు కేటాయిస్తోంది. అలాగే ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బీజేడీ మాజీ ఎంపీ భర్తృహారి మహ్తాబ్ పార్టీ మారిన కొద్ది సేపటికే కటక్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన ఒక వార్తాపత్రిక ఎడిటర్. అలాగే కలహండి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్థానిక రాజకుటుంబానికి చెందిన మాళవిక కేశరి డియో ఉన్నారు. ఆమె కూడా ఇంతకు ముందు బీజేడీలో కీలక స్థానాల్లో పని చేశారు. పార్టీ మారిన కొన్ని రోజులకే కమలదళం టికెట్ ఇచ్చింది.
ఆ పార్టీ ఆశావహుల్లో కాంగ్రెస్‌కు చెందిన కొందరు కూడా ఉన్నారు. పార్టీ నాయకులు తీవ్ర నిరాశలో ఉండడంతో చాలా మంది తమను రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఎవరూ పిలుస్తారో అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే గెలుపు గుర్రాలు ముద్రపడ్డ వారు ఆయా పార్టీల్లోకి చేరిపోయారు. వారిలో సురేంద్ర సింగ్ భోయ్, అన్షుమన్ మొహంతిలు ఈసారి BJD లోక్‌సభ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఉన్నారు.
అలాగే ఒడిశాలో అనేక మంది సినీ తారలు టికెట్ నిరాకరించడంతో పార్టీని వీడారు. ఇందులో అనుభవ్ మొహంతి, సిద్ధాంత్ మహపాత్ర, ఆకాష్ దాస్ లాంటి వారు బీజేడీని వీడారు. సిద్ధాంత్, ఆకాష్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో BJP అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు – వీరు దిగపహండి, కొరీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. వీరికి ఇంకా టికెట్ రాకపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.
నిరసనలు
సంవత్సరాల తరబడి పార్టీకి సేవలు చేసి తమకు టికెట్ వస్తే ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికవుదామనే కలలు కన్న వారందరి గొంతులో పచ్చి వెలక్కాయలా ఫిరాయింపుదారులు వచ్చి చేరారు. దాంతో బీజేపీ, బీజేడీ పార్టీల ముందు కొంతమంది  ఆశావాహులూ ఆందోళనకు దిగారు.
భువనేశ్వర్‌కు చెందిన శ్రీమయీ మిశ్రా వంటి చాలా మంది పార్టీ పాత-కాలపు వ్యక్తులు దుమ్మెత్తిపోయడానికి కారణాలు ఉన్నాయి. బీజేడీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె అప్పటికే నియోజకవర్గం చుట్టూ తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. అయితే పార్టీలో చేరిన రెండు గంటల్లోనే నామినేషన్ దక్కించుకున్న మన్మత్ రౌత్రేకు పార్టీ టిక్కెట్టు దక్కింది. దీనితో పోల్చితే, మాజీ శాసనసభ్యుడు ప్రియదర్శి మిశ్రా బిజెడిని వీడి భువనేశ్వర్ నార్త్ అసెంబ్లీ స్థానానికి బిజెపి అభ్యర్థిగా మారడానికి మూడు రోజులు పట్టింది.
రంగులు మారడంలో, ఒడిశా రాజకీయ నాయకులు ఊసరవెల్లిలను కూడా అధిగమించగలరని తెలుస్తోంది.


Tags:    

Similar News