అయోధ్య రామాలయంపై రెపరెపలాడిన కాషాయ జెండా

ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ఏర్పాటు చేసిన ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ..

Update: 2025-11-25 08:06 GMT
Click the Play button to listen to article

ఉత్తరప్రదేశ్‌(Utter Pradesh)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామాలయం(Janmbhoomi temple))లో ప్రధాని మోదీ(PM Modi) మంగళవారం (నవంబర్ 25) ఆలయ శిఖరంపై కాషాయ జెండా (saffron flag) ఎగురవేశారు. మందిర నిర్మాణం పూర్తయ్యిందన్న దానికి సంకేతంగా ఏర్పాటు చేసిన ధ్వజారోహణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ఎగిరే ఈ జెండా కాషాయవర్ణంలో ఉండి 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంటుంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ధ్వజారోహణ కార్యక్రమానికి మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. అంతకుముందు రోజు ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భగవత్ రామ్ బాలరాముడి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఆయన రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లోని సప్త మందిర్‌లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ తన ఫేక్‌బుక్ అకౌంట్‌లో “శ్రీ రామ జన్మభూమి మందిర్‌లో జరిగే ధ్వజారోహణోత్సవంలో పాల్గొనడానికి అయోధ్యలో అడుగుపెట్టాను!” అని రాసుకొచ్చారు.

భారీ భద్రత మధ్య ప్రధాని కాన్వాయ్ ముందుకు సాగుతుండగా.. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. మహిళలు, యువకులు ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికారు.


సప్త మందిర్‌ను సందర్శించిన ప్రధాని..

రోడ్‌షో తర్వాత సప్త మందిరాన్ని మోదీ సందర్శించారు. ఇందులో మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News