లోక్‌సభలో దుమారం లేపిన రాహుల్ వ్యాఖ్యలు..

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు కేంద్రమంత్రులు, ఎంపీలు అభ్యంతరం వ్యక్తంచేశారు.

Update: 2024-07-02 06:17 GMT

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం తరుపున రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన..కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు.

రాహుల్‌ దాదాపు ఒక గంట 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు అధికార పక్షం నుంచి పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పదేపదే అభ్యంతరం వ్యక్తంచేశారు.

బీజేపీ వాళ్లు అసలు హిందువులే కాదని రాహుల్‌గాంధీ అన్నారు. భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూధర్మం కాదని చెప్పారు. తాము హిందువులమని చెప్పుకొంటున్న వారు నిత్యం హింస, విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. మొత్తం హిందువులను హింసావాదులనడం తీవ్రమైన విషయం’’ అని ఖండించారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు.

మైనార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు, పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీపై చేసిన వ్యాఖ్యలు, ధనవంతుల బిడ్డల కోసమే నీట్ పరీక్ష.. అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్‌ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.

రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగాన్నిసోనియా గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి వీక్షించారు.

Tags:    

Similar News