రాముడు శాకాహారి కాదు.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

మరికొద్ది రోజుల్లో అయోధ్య శ్రీరామమందిరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన మాంసాహారీ అని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత వ్యాఖ్యలు చేయడంపై కలకలం చెలరేగింది.

Update: 2024-01-04 09:10 GMT
అయోధ్య రామమందిరం

శ్రీరాముడు బహుజనుడు.. ఆయన 14 ఏళ్లు అడవుల్లో వనవాసం చేశారు. మరి ఆయన శాకాహారీ ఎలా అవుతాడని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన మాంసాహారం తినేవాడని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ సహ ఇతర నాయకులు అవధ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"రాముడు బహుజనులైన మాకు దేవుడు. వనవాసం సందర్భంగా జంతువులను వేటాడి మాంసం భుజించేడివాడు. అతడిని దేవుడిగా చూపడం ద్వారా మమ్మల్ని కూడా శాఖాహారీగా మార్చాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు" అని బుధవారం షిర్డీలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "14 సంవత్సరాలు అడవుల్లో ఉంటూ శాకాహారం కోసం ఎక్కడికి వెళ్లాడు" అనే సందేహం వ్యక్తం చేశారు. రామాయణం ప్రకారం ఆయన అడవులకు వెళ్లడం నిజమే కదా అని ప్రశ్నించారు. అలాగే దేశానికి గాంధీ, పండిట్ నెహ్రూ గారి వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. గాంధీపై 1935,1938,1942 లో హత్య ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చివరగా 1948లో హత్యకు గురయ్యారని చెప్పారు. దీనిపై బీజేపీ నాయకత్వం భగ్గుమంది.

కొద్దిరోజుల్లో అయోధ్యలో శ్రీరామమందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

అజిత్ పవార్ వర్గం నిరసనలు

జితేంద్ర అవధ్ వ్యాఖ్యలపై అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నాయకులు బుధవారం రాత్రి ఆయన ఇంటి ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. దీంతో పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన ఇంటిదగ్గర అదనంగా పోలీసులను మోహరించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నేతృత్వంలోని మరో నిరసనకారుల బృందం హిందూ మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో ఆయన పై పోలీసు కేసు నమోదు చేసి, చట్టపరంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది. రాముడి గురించి చులకనగా మాట్లాడితే మాత్రం ఊరుకోం అని రామ్ కదమ్ హెచ్చరించారు. ఎన్నికలు రాగానే హిందూవులు గుర్తుకు వస్తారని, అప్పుడే హిందూత్వం గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News