‘NRC కోసమే S.I.R’
ఓటరు జాబితాను తారుమారు చేసి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్రం ఎన్నికల కమిషన్‌తో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చేయిస్తోంది’ - కేరళ సీఎం పినరయి విజయన్
కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(SIR)ను చేపట్టబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని EC అధికారులు ఇటీవల వెల్లడించారు. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో SIR చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinarayi విజయం) స్పందించారు.
‘NRC కోసమే ఇదంతా..’
కేరళ, ఇతర రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)ను అమలు చేయడం ద్వారా జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) ను తీసుకురావడానికి కేంద్రం యత్నిస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. SIR వల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో SIR వల్ల దాదాపు 65 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేరళలో ఈ ప్రక్రియ చేపట్టడం అసాధ్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే కమిషన్‌కు తెలియజేసినా.. కేంద్రం ఎన్నికల సంఘం మొండిగా ముందుకెళు తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో SIR చేపట్టడం తొందరపాటు చర్యగా పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో SIR చేపట్టరాదని శాసనసభ ఇటీవల ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశ పౌరులు, ప్రజాస్వామ్య సంస్థలు ఏకం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.