అభిమానిపై తుపాకీ ఎక్కు పెట్టిన నటుడు విజయ్ భద్రతా సిబ్బంది
సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, కాదంటున్న కొంతమంది అభిమానులు;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-06 12:40 GMT
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ నాయకుడు విజయ్ బాడీగార్డ్ ఒకరు తుపాకీని బయటకు తీసి అభిమాని వైపు రావడం వివాదాస్పదమైంది. మధురై విమానాశ్రయంలో భద్రతా వలయాన్ని ఛేదించి ఒక అభిమాని విజయ్ వద్దకు వెళ్లగా, ఆయన బాడీగార్డు తుపాకీని బయటకు తీశాడని తెలుస్తోంది.
విమానాశ్రయంలోకి ప్రశాంతంగా ప్రవేశించిన విజయ్ ఈ గందరగోళాన్ని పట్టించుకోలేదు. బయట పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. కొన్ని గంటల తరువాత అభిమాన హీరోను చూడగానే జనం ఒక్కసారిగా దూసుకొచ్చారు.
అయితే బాడీగార్డ్ అభిమానిని చూడగానే ఆయుధాన్ని తీశాడా.. లేదా విమానాశ్రయా టెర్మినల్ లోకి ప్రవేశించేముందు తన సహచరుడికి ఇవ్వడానికి దాన్ని బయటకు తీశాడా అనే విషయంలో స్పష్టత లేదు. దీనికి సరైన సమాధానాలు ఇంకా లభించలేదు.
ఈ సంఘటనలకు సంబంధించి అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో విజయ్ తన వాహనం నుంచి దిగుతున్నట్లు చూపించాయి. ఇందులో అశేష అభిమాన గణం ఆయన చుట్టూ ఉంది.
ఏమైంది..
అయితే ఒక అభిమాని భద్రతా దళాలను ఛేదించి చేతిలో శాలువాతో నటుడి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించాడు. విజయ్ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుంది. ఒక అంగరక్షకుడు తుపాకీని అతని వైపు గురిపెట్టినట్లు కనిపించింది. అయితే ఆ అభిమాని ఆ ఆయుధాన్ని గుర్తించలేదు.
తరువాత అభిమాని జర్నలిస్ట్ తో మాట్లాడుతూ.. తుపాకీ అక్కడ ఉందని నాకు తెలియలేదు. భద్రతా కారణాల రీత్యా బౌన్సర్లు అలా చేశారు. వారు తప్పు చేశారని నేను అనుకోను’’ అన్నారు.
అభిమానుల ప్రతిచర్యలు..
భద్రతా సిబ్బంది చర్య సమర్థనీయమే అని కొంతమంది అభిమానులు నమ్ముతుండగా, మరికొందరు విజయ్ సిబ్బంది చాలా దూకుడుగా ప్రవర్తించారని అంటున్నారు.
‘‘ఇది భయానకంగా ఉంది’’ అని ఒక అభిమాని ఎక్స్ లో రాసుకొచ్చారు. బహిరంగ ప్రదేశంలో అభిమానులపై విరుచుపడిన నటుడు విజయ్ భద్రతా సిబ్బంది అని మరోకరు అన్నారు. విజయ్ కంటే రజనీకాంత్, అజిత్ సర్ వంటి వారు ప్రజలు, పత్రికల విషయంలో చాలా దయతో వ్యవహరిస్తారని కొంతమంది అభిమానులు గుర్తు చేశారు.
అయితే కొంతమంది అభిమానులు తుపాకీని బయటకు తీసిన బయటకు తీసిన గార్డు దానిని తన సహచరుడికి ఇవ్వడానికి అలా చేశాడని, అదే సమయంలో అభిమాని అతని వైపు పరుగెత్తుకుంటూ వచ్చాడని, అప్పుడే వీడియో తీశారని పేర్కొన్నారు.
‘‘గార్డు తన తుపాకీని ఎందుకు బయటకు తీశాడు. సింపుల్, టెర్మినల్ లోపలికి తుపాకులు అనుమతించబడవు. అతను లోపలికి వెళ్లే ముందు దానిని మరొక అధికారికి అందజేస్తున్నాడు. ఇది ప్రోటోకాల్’’ అని మరో అభిమాని ఎక్స్ లో రాసుకొచ్చాడు.