సీఎం సిద్ధరామయ్యకు కాంట్రాక్టర్ల అల్టిమేటం..

రానున్న రెండు మాసాల్లో పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించిన కేఎస్‌సీఏ ప్రతినిధులు..

Update: 2025-10-19 08:09 GMT
ప్రతిపక్ష బీజేపీ నేత అశోక
Click the Play button to listen to article

కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను చెల్లించడంలో కర్ణాటక(Karnataka) రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ(BJP) నాయకుడు ఆర్. అశోక (R Ashoka) ఆరోపించారు. రూ. 33వేల కోట్ల బిల్లులను క్లియర్ చేయాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని "బెదిరించలేరు" అని డిప్యూటీ సీఎం శివకుమార్ (Deputy CM shiva kumar) శాసనసభలో చేసిన వ్యాఖ్యలకు అశోక కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో బకాయిలను క్లియర్ చేసే విషయాన్ని ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తామని డీకే కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు.

డిప్యూటీ సీఎంను కలిసిన కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం (KSCA) ప్రతినిధులు .. రాబోయే రెండు నెలల్లో బకాయిలను చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గత బీజేపీ పాలనతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బిల్లుల క్లియరెన్స్‌కు రెట్టింపు కమీషన్ చెల్లించుకోవాల్సి వస్తుందని ఇటీవల సిద్ధరామయ్యకు కేఎస్‌సీఏ ప్రతినిధులు లేఖ రాశారు.

"కాంగ్రెస్ పాలనలో తమ బిల్లులు చెల్లించాలని కోరడం కూడా తప్పని పోయింది. . జవాబుదారీతనం పోయి అహంకారం, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌నుద్దేశించి జేబు రాజ్యాంగంలో బకాయిలపై డిమాండ్ చేసే హక్కు కూడా లేకపోవడం దురదృష్టకరం’’ అని అశోక సామాజిక మాధ్యమంలో ఎక్స్‌లో పోస్టు చేశారు.  

Tags:    

Similar News