అన్నాడీఎంకే కూటమి 210 సీట్లు గెలుచుకుంటుంది: ఈపీఎస్

డీఎంకే ప్రజాదరణ కోల్పోయిందని వ్యాఖ్యానించిన పళని స్వామి

Update: 2025-12-10 10:46 GMT
పళని స్వామి

తమిళనాడులో అధికార డీఎంకే ప్రజాదరణ కోల్పోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి 210 సీట్లు గెలుచుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళని స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ అత్యున్నత నిర్ణయాధికారం సంస్థల కార్యనిర్వాహాక కమిటీ, జనరల్ కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీతో తమ పార్టీ పొత్తునే డీఎంకే విమర్శిస్తూనే ఉంటుందని, కానీ అన్నాడీఎంకే బంగారు పాలన గురించి వారు ఏమి చెప్పలేరని పళని స్వామి అన్నారు.

‘‘ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి 210 సీట్లు గెలుచుకుంటుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి మీరందరూ మీ సహకారాన్ని అందించాలి’’ అని ఆయన అన్నారు.

తమిళనాడు లో ఎన్డీఏకు అన్నాడీఎంకే నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు 2026 ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

పార్టీని దివంగత ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జే. జయలలిత నిర్మించి రక్షించారని చెప్పారు. ‘‘శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి వారి నినాదం, తమిళనాడు ప్రజలకు వారి సంక్షేమ కార్యక్రమాల కారణంగా నేడు ఎవరూ పార్టీని తాకలేరు’’ అని అన్నారు.
డీఎంకేపై విమర్శలు గుప్పిస్తూ.. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలలో ప్రజాదరణ కోల్పోయిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, డీఎంకే పై దాడి చేస్తూ, స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలలో ప్రజాదరణ కోల్పోయిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, డీఎంకే విద్యార్థులకు 10 లక్షల ల్యాప్ టాప్ లను ఇస్తామని ప్రకటించింది.
‘‘మీరు ఇప్పుడు ఉచిత ల్యాప్ టాప్ లు ఎందుకు ఇవ్వాలి? కళాశాలలు ఐదు నెలల క్రితం తిరిగి ప్రారంభించబడ్డాయి. మీరు ప్రజలలో ప్రజాదరణను కోల్పోయి, వచ్చే ఏడాది ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో మీరు పది లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్ ట్యాప్ లు ఇస్తామని ప్రకటించారు’’ అని ఆయన ఆరోపించారు.
Tags:    

Similar News