సైబర్ మోసాలతో మూడేళ్లలో రూ. 5,474 కోట్ల నష్టం

అందులో సగం కూడా వసూలు చేయలేకపోయామన్న కర్ణాటక హోంమంత్రి

Update: 2025-12-10 11:23 GMT

కర్ణాటకలో గత మూడు ఏళ్లలో ప్రజలు సైబర్ మోసాల కారణంగా రూ. 5,474 కోట్లు కోల్పోయారని, అందులో ఇప్పటి వరూ పోలీసులు రూ. 627 కోట్లు రికవరీ చేయగలిగారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు.

శాసనసభలో సకలేశ్ పూర్ బీజేపీ ఎమ్మెల్యే సిమెంట్ మంజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల కాలంలో సైబర్ మోసం పెరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలలో కర్ణాటకలో దాదాపు 52,000 సైబర్ మోసాలు జరిగాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది’’ అని పరమేశ్వర అన్నారు.

పోలీసులు చట్టాలకు సవరణ తీసుకురావడం ద్వారా సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ప్రణాళిక వేసిందని ఆయన చెప్పారు. అయితే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ సవరణ పై కోర్టు స్టే తెచ్చుకుందని, ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. ఈ కేసు డిసెంబర్ 19కి జాబితా చేశారని ఆయన వెల్లడించారు.

2023 లో 22,000 సైబర్ మోసాలపై కేసులు నమోదయ్యాయి. వీటిలో పరిమిత సంఖ్యలో మాత్రమే గుర్తించామని, దీనివల్ల రూ. 873 కోట్ల నష్టాలు సంభవించయని, అందులో రూ. 177 కోట్లు రికవరీ అయ్యాయని పరమేశ్వర పేర్కొన్నారు.
2024 లో జరిగిన సైబర్ మోసాల వల్ల దాదాపు 22,400 కేసుల నుంచి రూ. 2,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు రూ. 300 కోట్లు రికవరీ చేశారని ఆయన వెల్లడించారు. 2025 సంవత్సరంలో ప్రభుత్వం చర్యల వల్ల సైబర్ మోసం కేసులు దాదాపు 13,000 కి తగ్గాయని, నష్టాలు రూ. 2000 కోట్లకు మించిపోయామని, ఇప్పటి వరకూ రూ. 125 కోట్ల రికవరీలు జరిగాయని మంత్రి వివరించారు.
సైబర్ మోసం కర్ణాటకకే కాకుండా మొత్తం దేశానికి ముఖ్య సవాల్ గా మారిందని అన్నారు. భారత్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని ప్రత్యేక సైబర్ వర్టికల్ ను రూపొందించిన మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక అని పరమేశ్వర పేర్కొన్నారు.
‘‘సైబర్ మోసానికి వ్యతిరేకంగా కర్ణాటక పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర సైబర్ కమాండ్ కింద 43 సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని ఆయన అన్నారు.
Tags:    

Similar News