కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

కోడిగుడ్ల ఉత్పత్తి, లభ్యతలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుతం కోడిగుడ్డు ఆహారంలో రోజువారీ భాగమైంది.

Update: 2024-02-15 06:33 GMT
Eggs

కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేవాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉంది. అంటే కోడిగుడ్ల ఉత్పత్తి, లభ్యతలో భారతదేశం ఎంతో ముందంజలో ఉందని చెప్పొచ్చు. పౌష్టికాహారానికి కోడి గుడ్డు మారుపేరుగా చెబుతుంటారు. వైద్యులు సైతం రోజుకో కోడిగుడ్డును తినాల్సిందిగా చెబుతున్నారు. ఆయుర్వేద, ప్రకృతి వైద్యులు కోడి గుడ్డును నేరుగా పచ్చిది తిన్నా, లేక ఉడకబెట్టి తిన్నా మంచిదేనని చెబుతున్నారు. అయితే ఇంగ్లీష్‌ వైద్యులు మాత్రం కోడి గుడ్డును ఉడకబెట్టి అందులోని పచ్చసొన తీసేసి తింటే మంచిదని చెబుతున్నారు. ఎవరు ఎలా చెప్పినా కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని చెబుతున్నారు. పైగా కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం కోడిగుడ్డు మాంసాహారం కాదని, శాఖాహారం కిందనే భావించాలని చెబుతుంటారు. నెయ్యి ఎలా శాఖాహారమో కోడిగుడ్డు కూడా అంతేనని పలువురు వైద్యులు చూచించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత 501
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోడిగుడ్డు వినియోగం, లభ్యతలో దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని కేంద్ర పశు సంవతర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 తెలిపింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత చాలా ఎక్కువగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి గుడ్ల తలసరి లభ్యత 501గా ఉందని సర్వే వివరాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం గుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
రెండో స్థానంలో తెలంగాణ
తెలంగాణం కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు సర్వే వివరాలు తెలిపాయి. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా దేశ వ్యాప్తంగా తలసరి గుడ్ల లభ్యత 95గా ఉంది.
1950–51లో ఏడాదికి కోడి గుడ్ల లభ్యత భారత దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండేది. ఆ తరువాత 1960–61లో ఈ సంఖ్య కొంచెం పెరిగిమ ఏడుగా మారింది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో తలసరి సగటు గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వేల్లో పేర్కొన్నారు. ఆ తరువాత 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్లు సర్వే వివరాలు వెల్లడించాయి. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ 20.41 శాతంతో మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలో ఉంది. అంటే ఉత్పత్తి అవుటున్న గుడ్లు రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని స్పష్టమవుతోంది. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న 12.86 శాతం ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందని సర్వే రిపోర్టులో వెల్లడంచారు. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్‌ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కర్నాటక రాష్ట్రాల్లోనే 64.56శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే వివరాలు వెల్లడించాయి.
ఏపీలో ఎందుకింత ఎక్కువ ధర
కోడిగుడ్లు ఒకప్పుడు రూ. 3లకు అమ్మేవారు. ఏపీలో ఇప్పుడు కోడిగుడ్డు ధర రూ. 7లుగా ఉంది. ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు కోడిగుడ్ల ధరలు తగ్గాల్సింది పోయి ఎక్కువ ఎందుకు అవుతున్నాయనే అనుమానం ప్రజల్లో ఉంది. ఉత్పత్తికి తగిన విధంగా సేల్స్‌ కూడా ఉండటం, పైగా తలసరి వాడకం కూడా వేరే రాష్ట్రాలతో పోలిస్తే ప్రథమ స్థానంలో ఉండటం వల్లనే ధరల పెరుగుదల ఉండి ఉంటుందని మార్కెట్‌ వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు.
ఒకప్పుడు కేవలం నాటు గుడ్లు మాత్రమే ఉండేవి. అవి కూడా మార్కెట్‌లో చాలా కష్టంగా అందుబాటులో ఉండేవి. నాటు కోడుగుడ్లు ఎక్కువగా కోళ్ల ద్వారా పొదిగించి కోడిపిల్లల ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పైగా అప్పట్లో ఎక్కువగా గ్రమాల్లో మాత్రమే కోడి గుడ్లు అందుబాటులో ఉండేవి. అయినా తక్కువ ధరకు దొరికేవి. ఇప్పుడు కోడిగుడ్లు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. బాయిలర్‌ కోళ్లు ఎక్కువగా పెంచి మాంసానికి ఉపయోగిస్తున్నారు. అయినా కోడిగుడ్ల ధరలు అదుపులోకి రాలేదు.
Tags:    

Similar News