మాట నిలబెట్టుకున్న బాబు.. మెగా డీఎస్‌సీపైనే తొలి సంతకం

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం చేశారు

Update: 2024-06-13 13:01 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే భారీ సంఖ్యలో పోస్ట్‌లతో మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్‌పై తన తొలిసంతకం చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం ఆయన తొలిసారి సెక్రటేరియట్‌కు విచ్చేశారు. అక్కడే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన బాధ్యతలను చేపట్టారు. అనంతరం సీఎంగా తన తొలి సంతకం మెగా డీఎస్‌సీపైనే చేశారు. దీనికి సంబంధించిన సమాచారన్ని టీడీపీ పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా షేర్ చేసింది. చంద్రబాబు ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పరని, నిరుద్యోగులకు ఎన్నికల ప్రచారం చెప్పిన విధంగా భారీ ఖాళీలతో నిజమైనా మెగా డీఎస్‌సీపై తన తొలి సంతకం చేశారని వెల్లడించింది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు.. ఈరోజు ఉదయం తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విజయవాడలో కొలువుదీరి ఉన్న అమ్మవారిని సతీసమేతంగా వెళ్లి దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన సాయంత్రం 4:41 గంటలకు సచివాలం చేరుకుని మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్‌లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సీఎస్ నీరభ్ కుమార్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్ల రవీంద్ర, నిమ్మ రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుకు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతల ఘన స్వాగతం పలికారు.

డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇలా..

ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎస్‌సీని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు.. తాము అధికారంలోకి వస్తే వైసీపీలో దగా డీఎస్సీని విడుదల చేయమన్నారు. భారీ సంఖ్యలో ఖాళీలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తామని, సీఎంగా తాను చేసే తొలి సంతకం దానిపైనే అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం చేశారు. ఈ నోటిఫికేషన్‌లో 16,347 టీచర్ పోస్ట్‌లు ఉన్నాయి. వీటిలో ఎస్‌జీటీ-6,371, పీఈటీ-132, స్కూల్ అసిస్టెంట్-7,725, టీజీటీ-1,781, పీజీటీ-286, ప్రిన్సిపాల్స్-52 పోస్ట్‌ ఉన్నాయి.

చెప్పినట్లే మిగిలిన సంతకాలు..

సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను చేసే సంతకాలను ప్రకటించిన విధంగా చంద్రబాబు తన తొలి నాలుగు సంతకాలు చేశారు. వాటిలో మొదటిది డీఎస్‌సీ అయిపోగా రెండో సంతకం.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై, మూడో సంతకం వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌పై చేశారు. అంతేకాకుండా అన్నక్యాంటీన్ల పునరుద్దరణపై తన నాలుగో సంతకాన్ని కూడా చేశారు. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

Tags:    

Similar News