చంద్రబాబు అరెస్టై రేపటితో ఏడాది

చంద్రబాబు అరెస్టై అప్పుడే ఏడాది కావచ్చింది. నాడు ప్రతిపక్ష నేతగా అరెస్టు అయిన చంద్రబాబు ఏడాది తిరక్క ముందే నాలుగో సారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు.

Byline :  The Federal
Update: 2024-09-08 10:06 GMT

చంద్రబాబు నాయుడు అరెస్టై రేపటితో ఏడాది పూర్తి కానుంది. పోయిన సంవత్సరం అంటే 2023 సెప్టెంబరు 9వ తేదీన చంద్రబాబును అరెస్టు చేశారు. నంద్యాల పర్యటనలో ఉండగా తెల్లవారు జామున పోలీసులు ఆయన శిబిరం వద్దకు వెళ్లి అరెస్టు చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా అరెస్టు అయిన చంద్రబాబు నేడు ముఖ్యమంత్రి హోదాలో ఉండటం గమనార్హం.

సెప్టెంబరు 9, 2023 నుంచి 2024 సెప్టెంబరు 9 వరకు ఈ ఏడాదిలో రాజకీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఊహించని విధంగా పరిణామాలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు రావడం, అంచనాలను తారు మారు చేస్తూ జగన్‌ ప్రభుత్వం పడిపోడం, ఎన్నడు లేని విధంగా అత్యధిక స్థానాల్లో చంద్రబాబు కూటమి కైవసం చేసుకోవడం, తిరిగి నాలుగో సారి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠమెక్కడం చక చక జరిగి పోయాయి. ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో.
2023 సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టయ్యారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తెల్లవారు జామున అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులకు, చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకు మధ్య పెద్ద వాగ్వాదాలే చోటు చేసుకున్నాయి. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబుతో సహ ఆయన పార్టీ నేతలు పోలీసులను నిలదీశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 50(1),(2) కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు స్పాట్‌లో పోలీసులు వివరించే ప్రయత్నం చేశారు. 
కనీసం ప్రైమరీ ఎవిడెన్స్‌ లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారనే విమర్శలు వెల్లవెత్తాయి. ఇదే ప్రశ్నలను చంద్రబాబు, ఆయన తరపున న్యాయవాదులు కూడా పోలీసులను అడిగారు. అయితే పోలీసులు వద్ద మాత్రం దానికి సరైన సమాధానం లేకుండా పోయింది. రిమాండ్‌ రిపోర్టును న్యాయస్థానికి సమర్పించే సమయంలో పూర్తి డిటెయిల్స్‌ ఇస్తామని చంద్రబాబు, ఆయన తరపున న్యాయవాదులతో చెప్పి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, చంద్రబాబు, ఆయన తరపున నాయకులు, న్యాయవాదులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు పోలీసులను నిలదీశారు. పోలీసులు దీనికి నేరుగా సమాధానం చెప్ప లేక మా వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని హైకోర్టుకు ఇచ్చామని, రిమాండ్‌ రిపోర్టులో అన్ని ఉన్నాయని, విజయవాడకు చేరుకునేలోగా ఆ రిపోర్టును మీకిస్తామని డీఐజీ కొల్లు రఘురామిరెడ్డి చంద్రబాబుకు, ఆయన తరపున న్యాయవాదులకు చెప్పి చంద్రబాబును అక్కడ నుంచి అరెస్టు చేసి విజయవాడకు తరలించేందుకు పూనుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేసి తీరాలనే లక్ష్యంతో వెళ్లిన డీఐజీ కొల్లు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ముందుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి తరలించి తర్వాత చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడ తరలించేందుకు ప్లాన్‌ చేశారు. అయితే చంద్రబాబు తన అరెస్టును మాత్రం తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, తాను ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్టీనని, తన కాన్వాయ్‌లోనే విజయవాడకు వస్తానని చెప్పడంతో దానికి అంగీకరించిన డీఐజీ కొల్లు రఘురామిరెడ్డి చంద్రబాబును తన కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించారు.
స్కిల్‌డెవలప్‌మెంట్‌ అక్రమాల ఆరోపణల కేసులో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. క్రైమ్‌ నంబరు 20/2021 కింద అరెస్టు చేస్తున్నట్లు చంద్రబాబుకు ఇచ్చిన సీపీఆర్‌పీసీ నోటీసులో తెలిపారు. ఐపీసీలోను 120(బి) 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్‌ విత్‌ 34, 37 సెక్షన్లతో పాటు 1988 అవినీతి చట్టంలోని 12, 13(2) రెడ్‌ విత్‌ 13(1)(సి),(డి) సెక్షన్‌ల కింద అరెస్టు చేస్తున్న నోటీసులో పేర్కొన్నారు.
Tags:    

Similar News