చంద్రబాబు రాజకీయ ప్రస్థానం
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-12 08:42 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో 1978లో గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో ఎదురులేని వ్యక్తిగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యారు.
1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు.
1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు.
1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు.
1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.
2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.
2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.
2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.
నవ్యాంధ్రకు రెండో సారి సీఎంగా నేడు ప్రమాణం చేసిన చంద్రబాబు.