గుంటూరు మేయర్‌పై పోలీసు కేసు
జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు.
By : The Federal
Update: 2024-11-17 08:27 GMT
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను మనోహర్ నాయుడు గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌లను మనోహర్ నాయుడు అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, అసభ్యకర పదజాలంతో దూషించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మనోహర్ నాయుడుపై కేసు నమోదు చేశారు.
చంద్రబాబు అరెస్టు చేసిన సమయంలో, దానిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు గుంటూరు అరండల్‌పేట ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన రెండు పార్టీల శ్రేణులు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆ సయమంలో అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూసేందుకు పోలీసు బలగాలు కూడా మోహరించారు. సరిగ్గా ఆ సమయంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా అక్కడి చేరుకున్నారు. పోలీసుల చేతిలోని లాఠీని తీసుకొని, పోలీసుల కంటే దారుణంగా వ్యవహరిస్తూ, టీడీపీ, జనసేన శ్రేణులపై దురుసుగా ప్రవర్తిస్తూ, లాఠీ ప్రతాపం కూడా చూపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను పరుష పదజాలంతో దూషించారు. దీనిపై నాడే టీటీడీ, జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నాడు పోలీసులు దీనిని పట్టించుకోలేదు. పక్కన పెట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సంఘటన తెరపైకి వచ్చింది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలపైన టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మనోహర్‌నాయుడుతో పాటు పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. వాకాటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట అంసెబ్లీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపాటి పుల్లారావు చేతిలో ఓటమి పాలయ్యారు.