చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి..?

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఈనెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా.

Update: 2024-06-05 10:11 GMT

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండి విజయం సాధించింది. 164 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలు విజయం సాధించింది. విజయం ఖరారైన వెంటనే అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఆకాశాన్నంటేలా చాబు ప్రమాణ స్వీకారం జరగనుందని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ కూడా విచ్చేస్తారని, కేంద్ర కేడర్‌లోని ప్రముఖులు విచ్చేయనున్నారని కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరవుతారా అన్న అంశం కీలకంగా మారింది.

తప్పకుండా వెళ్తా

దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడులకు రేవంత్ హాజరవుతారా అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతుండటంతో దానికి ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు. ఒకవేళ తన ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరుకావాలంటూ చంద్రబాబు ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఆహ్వానం రాకుంటే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెళ్లనని తేల్చి చెప్పారు.

రేవంత్‌కు ఆహ్వానం లభిస్తుందా

తనకు ఆహ్వానం వస్తే తప్పకుండా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తానని రేవంత్ రెడ్డి చెప్పడంతో సరికొత్త అనుమానాలు రేకెత్తాయి. రేవంత్ వెళ్తాడు ఓకే కానీ అసలు టీడీపీ.. రేవంత్‌ను ఆహ్వానిస్తుందా? ఆహ్వానిస్తే పొరుగు రాష్ట్ర సీఎంగా ఆహ్వానిస్తుందా? లేకుంటే ఒకప్పటి పార్టీ నేతగానే ఆహ్వానిస్తుందా? అన్న అనుమానాలు చెలరేగుతున్నాయి. అంతేకాకుండా ఒకవేళ టీడీపీ ఆహ్వానించి, రేవంత్ వస్తే.. ఆయనతో చంద్రబాబు ప్రత్యేక హోదాపై చర్చిస్తారా అన్న అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News