తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఏప్రిల్ నెల ఆర్జిత సేవా సహ ఇతర సేవ టిక్కెట్లు రేపు విడుదల కానున్నాయి. ఏయే సేవా టిక్కెట్లు ఏయే ఏయే తేదీలలో లభ్యం కానున్నాయే వివరాలు..
1. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిప్ పద్దతిలో రేపు అంటే 18-01-2024 ఉదయం 10 గంటల నుంచి 20 -01-2024 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
2. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు, కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీ సేవలు జనవరి 22 , ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
3. తిరుమలలో వార్షిక వసంతోత్సవం సేవలు ఏప్రిల్ 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ టిక్కెట్లు జనవరి 22న ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
4. ఆన్లైన్ సేవ( వర్చువల్ పద్దతిలో) కల్యాణంలో శ్రీవారి దర్శనం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఎస్డీ సేవల టిక్కెట్లు జనవరి 23 మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
5. తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు జనవరి 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
6. శ్రీవాణి ట్రస్ట్ దాతల వారి శ్రీవారి దర్శనం, వసతి కోట టికెట్లు జనవరి 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
7. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల కోటా టిక్కెట్లు జనవరి 23 మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
8. ప్రత్యేక దర్శనం టికెట్లు రూ. 300 లవి జనవరి 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
9. తిరుమల & తిరుపతి వసతి కోటా జనవరి 24 మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది.