విద్యార్థుల దేశ భక్తి ఆనందాన్ని కలిగించింది

కోరుకొండ సైనిక స్కూల్‌ విద్యార్ధులతో ముచ్చటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Update: 2024-09-26 11:23 GMT

విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థుల్లో కనిపిస్తున్న దేశ భక్తి, క్రమ శిక్షణ తనకెందో ఆనందాన్ని కలిగించాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గురువారం విజయనగరం జిల్లా పర్యటన చేశారు. అందులో భాగంగా కోరుకొండ సైనిక్‌ పాఠశాలను సందర్శించారు. ఎస్పీ వకుల్‌ జిందాల్, స్కూల్‌ ప్రిన్సిపల్, గ్రూప్‌ కెప్టన్‌ ఎస్‌ఎస్‌ శాస్త్రి వెంకయ్యనాయుడుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించారు. ఆర్‌డివో ఎంవీ స్యూకళ, తహశీల్దారు కూర్మనాథరావు, సైనిక్‌ పాఠశాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్‌ స్కూల్‌ ను గురువారం నేను సందర్శించాను. పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరం. కెప్టెన్‌ ఎస్‌ ఎస్‌ శాస్త్రితో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించాను. విద్యార్థులతో ముచ్చటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, వారిలో కనిపిస్తున్న క్రమశిక్షణ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భవిష్యత్తులో భారత సైన్యంలో చేరి సేవలందించాలనుకునే విద్యార్థులకు ఇక్కడ అందిస్తున్న శిక్షణ అత్యుత్తమం.


Tags:    

Similar News