‘తిరుపతి జిల్లా పౌర చైతన్య వేదిక’ ఆవిర్భావం

ప్రస్తుత సమాజంలో పతనమవుతున్నమానవ విలువలను పునరుద్ధరించాలి. పొంచి ఉన్న పెనుముప్పు నుంచి పౌరహక్కులను, లౌకిక విధానాన్ని కాపాడాలి

Update: 2023-12-31 11:09 GMT
తిరుపతిలో పౌర చైతన్య వేదిక ప్రారంభం

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తు న్న ‘ఉపా’ (UAPA)వంటి నిరంకుశ చట్టా లను తిరస్కరించే లా పోరాడా లి.

వీటిపై ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం తిరుపతిలో ఆదివారం (డిసెంబర్ 31వ తేదీ) ‘తిరుపతి జిల్లా పౌరచైతన్య వేదిక’ ఆవిర్భవించింది. సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లాలోని పలు చోట్ల నుంచి వివిధ రంగాలకు చెందిన అనేకమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ’తిరుపతి జిల్లా పౌరచైతన్య వేదిక’ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈ ’వేదిక‘ గౌరవ సలహాదారుగా సాకం నాగరాజు, గౌరవ అధ్య క్షులుగా ఏ. రాఘవ శర్మ, అధ్యక్షులుగా వాకా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కె. కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.




 

ఉపాధ్యక్షులుగా డాక్టర్ రామచంద్రా రెడ్డి, ముషీర్ అహ్మద్, కార్యదర్శిగా జి.ప్రతాప్ సింగ్, అజీమ్ బాషా ఎన్నిక కాగా, కోశాధికారిగా ఏ. హరీష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డి.నిర్మల, బాబు, మునీంద్ర, వి.క్రిష్ణ, మోహన్, కె.ఉమామహేశ్వర చౌదరి, మురగారెడ్డి, ఏ.ఎన్. పరమేశ్వరరావు, రాము, షరీఫ్ తదితరులు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా పౌరచైతన్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త ఎస్ . గోవిందరాజులు మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాల బాధ్యతల నుంచి ప్రభుత్వాలు వైదొలిగి, ఆ బాధ్యతను ప్రైవేటు కార్పొరేట్ రంగానికి అప్పగించేశాయిని, ఫలితంగా విద్యార్థుల్లో ఆత్మహత్యలు, మానసిక వైకల్యాలు వంటి విషాదాలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు.

సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి రాజ్యాంగ పదవుల నియామక కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిని తొలగించారని గుర్తు చేశారు. మతాన్ని రాజకీయాల్లో మిళితం చేయడం వల్ల వివిధ మతస్తుల మధ్య అపనమ్మకాలు, అపోహలు పెరిగిపోయాయని వివరించారు.

సినిమాలు, మాధ్యమాల్లో ఆశ్లీలత పెరిగిపోయిందని, ఫలితాంగా స్త్రీలపైన, ముఖ్యంగా బాలికలపైన అత్యాచారాలు జరగడానికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ రంగం పర్యావరణాన్ని ధ్వంసం చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, ఆదివాసీల జీవితాలు నాశనం అవుతున్నాయని, రోజు రోజుకూ జాతి వైషమ్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వీటిపై పౌర సమాజానికి చైతన్యం కలిగించడానికి సభలు, సమావేశాలు, పుస్తక ఆవిష్కరణలు, పుస్తక సమీక్షలు, ప్రదర్శనలు జరపనున్నట్టు తెలిపారు. వీటి కోసం ‘పౌరచైతన్య వేదిక’ నిబద్దతతో నిస్వార్థంగా కృషి చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

Tags:    

Similar News