ఈ–ఆఫీస్‌లో ఏమి జరిగింది?
ఆంధ్రప్రదేశ్ ఈ–ఆఫీసు వ్యవస్థలో ఏమి జరుగుతోంది. ఎందుకు చంద్రబాబు ఈ వ్యవస్థ అప్‌గ్రేడేషన్‌ను వద్దంటున్నారు.
ఈ–ఆఫీసు అంటే ఎలక్ట్రానిక్ ఆఫీసు. దీని ద్వారానే ప్రభుత్వ పేమెంట్లు జరుగుతుంటాయి. రకరకాల వెబ్‌సైట్లు కూడా ఈ–ఆఫీసు వ్యవస్థలోనే పని చేయాల్సి ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ప్రక్రియలు, సేవల పంపిణీలో పారదర్శకత, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఈ–ఆఫీసు వ్యవస్థ ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్(ఎన్‌ఐసి) పర్యవేక్షణలో నడుస్తుంది. ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్ చేయాలని గతంలో ఉన్న వర్షన్స్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా జరగాలంటే ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్ర ఎన్‌ఐసీ బృందం ఈ నెల 17 నుంచి 25 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిచ్చిన షెడ్యూల్‌ను అంగీకరించింది. ఇవే తీదీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కేరళా, రాష్ట్రాల్లో సీబీఎస్సీ వంటి సంస్థల్లోను షెడ్యూల్‌ను కేంద్రం ఇచ్చింది. పాత వర్షన్స్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించాల్సి ఉంది. ఈ సవరణలను ఎన్‌ఐసీ నిలపి వేసింది. దీంతో తాజాగా ఈ–ఆఫీసును 7.“కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో కొత్త ఫీచర్లను ఉపయోగించి 14 రాష్ట్రాలు ఈ–ఆఫీసును అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.