తెలంగాణలో డబ్బుకాసే నారు పెంచిన ఆంధ్రా కౌలు రైతు...
ఆంధ్రాలో నేర్చుకున్న విజ్ఞానం తెలంగాణలో లక్షలు పండించింది. అది కూడా ఆరునెలల్లోనే.
డబ్బులేమన్నా చెట్టుకు కాస్తున్నాయా అంటుంటారు. అందులో చాలా నిజముంది. జీవన సారం ఉంది. డబ్బులు చెట్లకు కాస్తాయి. డబ్బులు కాసే చెట్లను పెంచాలన్నా, చెట్లు కాసే డబ్బులు అందుకోవాలన్న కొద్ది కృషి ఉండాలి. పెద్దలమాటను తెలివిగా అర్థం చేసుకోవాలి. అదెలాగో తెలంగాణ జిల్లాలో మొక్కలకు డబ్బులు పూయించిన ఇద్దరు ఆంధ్రా కౌలు రైతుల తీరు చూస్తే అర్థమవుతుంది.
గోవిందరెడ్డి, శివకోటిరెడ్డి సోదరులు వలస రైతుల, కౌలు రైతులు. వీరికి సొంత భూమి భూమిలేదు. ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా వినుకొండ మండలం చెరువుకొమ్ములపాలెం గ్రామం సొంతవూరు. బతుకు తెరువు తెలంగాణలో దొరుకుతుందేమోనని పోయిన సంవత్సరం డిసెంబరులో కుటుంబాలతో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవపూర్ గ్రామానికి వలస వచ్చారు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కౌలుకు కొంత భూమి తీసుకొని ఏదైనా పంట సాగుచేసి నాలుగు పైసలు సంపాదించాలనే తపన వాళ్లది. అనువైన సాగు భూమి కోసం వెతికారు.ఆ గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద ఎనిమిదెకరాలను ఏడాదికి రూ.65వేలకు కౌలుకు తీసుకున్నారు. అయితే ఆ గ్రామంలో కోతుల బెడద ఉంది. కోతులు ముట్టని పంట వేస్తే ఫలితం దక్కుతుంది. దీనికి పొగాకు అనువయిందని భావించారు.పొగాకు నారుమళ్లు సాగు మొదలు పెట్టారు.జూన్, జనవరి మధ్య పొగాకు సాగుకు అనువైన కాలం. కొత్త వూర్లో సెటిల్ అయ్యే లోపు సీజన్ వచ్చింది. వాళ్లరాకకు సీజన్ కు మ్యాచ్ కుదిరింది.
కౌలుకు తీసుకున్న ఎనిమిదెకరాల్లో నాలుగెకరాల్లో మామిడి తోట ఉంది. మిగతా నాలుగెకరాల్లో పొగాకు నారు పోయవచ్చు. గత జూన్‌లో మొదట దుక్కిదున్ని భూమిని చక్కగా చదును చేశారు. ట్రాక్టర్ సాయంతో నాలుగు అడుగుల వెడల్పు, 240 అడుగుల పొడవుతో నారు బెడ్లను రూపొందించారు. ఆ బెడ్ల పైన చెత్తాచెదారం తొలగించి మట్టిని చదును చేసి చీడపీడల నివారణకు రసాయనాలు పిచికారీ చేశారు. ఒక ఎకరం విస్తీర్ణంలో సరాసరిగా 45 బెడ్‌లను ఏర్పాటు చేసి ఎకరాకు కిలో పొగాకు విత్తనాలు వేశారు. ఇలా మొత్తం నాలుగెకరాల్లో 180 బెడ్‌లను ఏర్పాటు చేశారు. నారు మళ్లకు నీటిని స్పింక్లర్ల ద్వారాఅందించారు. ఇలా ఎకరానికి రూ లక్ష చొప్పున ఖర్చయింది. పొగాకు నారు పెంచడంపై అన్నదమ్ములు మంచి అనుభవం ఉంది. కోతుల బెడద పోయింది. ఇక చీడ బెడద నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎరువులను చల్లేందుకు, నారు మీద రసాయనాలు చల్లేందుకు వీళ్లు స్ప్రింక్లర్లనే వాడారు.
పొగాకు చెట్లకు డబ్బులు కాశాయి.
వాళ్ల పొలంలో ప్రతిదానికి లెక్క ఉంది. అందుకే నీరు రెడీ అయ్యాక ఏం జరిగింది.లెక్క కాయడం మొదయ్యింది ఇలా. 240 అడుగుల పొడవున్న బెడ్‌ను అరవై అడుగుల ప్లాట్ లుగా విభజించారు. ఇలా నాలుగు ప్లాట్లు తయారయ్యాయి. ఒక్కో ప్లాట్ లో పోసిన నారును రూ.5వేలకు విక్రయించారు. అంటే ఒక బెడ్‌కు రూ.20వేలొచ్చాయి. ఇలా ఎకరా విస్తీర్ణంలో ఉండే 45 బెడ్‌లకు రూ.9 లక్షలొచ్చాయి. మొత్తంగా నాలుగెకరాలకు కలిపి రూ.36 లక్షలు చేతికందాయి. ఎకరాకు రూ. లక్షన్నర పెట్టుబడితో రూ.6లక్షలు రాబడి తీశారు. ఖర్చ తీస్తే రూ.30 లక్షల లాభం వచ్చిందని ఆంధ్రా వలస రైతు గోవిందరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
ఆంధ్రోళ్ల తెలివి
తర్వాత సెప్టెంబరు ప్రయోగం రిపీట్ చేశారు. ఆ నెలాఖర్లో మళ్లీ పొగాకు నారుమళ్లు పోశారు. ఈ సారి విచిత్రం. నారు పెరుగే దాకా ఉండనవసరం లేకుండా నారు పెరుగుతుండగానే రైతులు అడ్వాన్స్‌లు చెల్లించి కొనుగోలు చేశారు. అంటే మరో రూ.30 లక్షల లాభంతో మొత్తంగా ఆరు నెలల్లో రూ.60లక్షలు సంపాదించారు! నారు విక్రయం పూర్తయ్యాక అదే స్థలంలో పొగాకుతోటను సాగు చేస్తామని ఆ రైతు సోదరులు చెబుతున్నారు.
ఇక్కడ కోతుల బెడద తీవ్రంగా ఉంది.పొలం దగ్గిర కూర్చుని కోతులను తరుముతూ ఉండలేం. అందుకు ఏంచేయాలో ఆలోచించాం. పొగాకు సరైందని భావించాం. ఎందుకు పొగాకు వాసనకు కోతులు పంటదగ్గిరకు రావు. సులభం కోతుల బెడద నుంచి బయటపడ్డామని వారు చెప్పారు.
ఎరువులు చల్లితే సమస్యలొస్తాయని స్ర్పింక్లర్ల ద్వారానే పిచికారీ చేశారు. ఒకవేళ కరెంటు పోయినా నీళ్ల సమస్య నివారించేందుకు గుంత తవ్వి సరిపడా నీటిని నిల్వ చేశారు. వీళ్ల సేద్యం టెక్కిక్ మెళకువల మీద ఆంధ్రజ్యోతి లో ఒక ఆసక్తికరమయిన కథనం వచ్చింది.