ఈ సర్కార్‌ వల్ల రాష్ట్రానికి నష్టమే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలు పేపర్లకే పరిమితం అవుతున్నాయా?;

Update: 2025-08-18 08:11 GMT

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క పనంటే ఒక్క పని కూడా సక్రమంగా చేయడం చేతకాని ప్రభుత్వమంటూ విసుర్లు విసిరారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేసిన ఒక్క మంచిపనయినా ఉందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రమంతా వర్షాలు కుమ్ముతుంటే.. ఎక్కడ చూసినా చెత్తే దర్శనమిస్తోందన్నారు. ఎక్కడపడితే అక్కడ చేతపేరుకుపోవడంతో దోమలు బెడద పెరిగిపోతోందని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. మున్సిపల్ శాఖ, ఆరోగ్యశాఖ మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ది ఓ చెత్త సర్కారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో

‘‘రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్‌ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం "ఆర్ఆర్ ట్యాక్స్" వసూళ్లలో బిజీగా ఉన్నారు’’ అని విమర్శలు చేశారు.

ఆదేశాలు పేపర్లకే పరిమితమా..!

అయితే రాష్ట్రంలో భీకరంగా వర్షాలు పడుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అధికారులకు ఆదేశాలిచ్చారు. అన్ని శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేయాలని చెప్తూనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధ్యులు ప్రభలకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం సీఎం రేవంత్ ఆదేశాలు పేపర్లకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. సమావేశంలో ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న చర్చలు మొదలయ్యాయి. కాగా అనేక ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. 

Tags:    

Similar News