‘‘బెళగావి మా రాష్ట్రంలో భాగం.. మహారాష్ట్రలో విలీనం కాబోదు’’

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Update: 2025-11-02 06:12 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మరోసారి బెళగావి వివాదం రాజుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దుపై కేంద్రం నియమంచిన మహాజన్ కమిటీ తుది నివేదిక రావడానికి ముందు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి మాటల తూటాలు పేలే పరిస్థితి కనిపిస్తోంది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బెళగావి రాష్ట్రంలో అంతర్భాగం అని, మహారాష్ట్రలో విలీనం చేయడానికి ఎప్పటికీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
‘‘బెళగావి సమస్యపై ఎలాంటి రాజీలేదు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ మహాజన్ కమిటీ నివేదికనే ఫైనల్. బెళగావి కన్నడ భూమి. కర్ణాటకలో విడదీయరాని భాగం, కాబట్టి మేము దీనిని వదిలిపెట్టం. దీనిని ఎవరూ కాదనలేరు’’ అని మైసూర్ లో భువనేశ్వరి, అన్నమ దేవీ ఊరేగింపును జెండా ప్రారంభించిన సందర్భంగా సీఎం అన్నారు.
బెళగావి వివాదం మహారాష్ట్ర, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతోంది. దాని చుట్టుపక్కల ప్రాంతాలలో మరాఠి భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నందున అది మా భూభాగం అని మహారాష్ట్ర వాదిస్తోంది.
అయితే దీనిని మహాజన్ కమిటీకి వదిలివేయాలని, దాని నిర్ణయమే తుది అంశంమని కర్ణాటక అంటోంది. రాజధాని బెంగళూర్ తో పాటు బెళగావిలోనే కర్ణాటక ప్రభుత్వం విధాన సభను నిర్మించి శాసనసభ సమావేశాలను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ మహారాష్ట్ర ఏకీకరణ సమితీ(ఎంఈఎస్) ఎమ్మెల్యేలు ఐదుగురు ఎన్నికయ్యే వారని, ఇప్పుడు వారికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని సిద్ధరామయ్య అన్నారు.
ఎంఈఎస్ వ్యక్తులు కూడా కన్నడిగులే. వారిలో ఎవరైనా రౌడీయిజానికి పాల్పడితే మేము వారిపై కఠినంగా వ్యవహరిస్తాము’’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడ పాఠశాలల అభివృద్ధికి అవసరమైనది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన కన్నడ కార్యకర్తలకు తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడటానికి కన్నడ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని ప్రశంసిస్తూ కన్నడ అనుకూల ఆందోళనలకు సంబంధించిన వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ఆయన హమీ ఇచ్చారు. కన్నడ భాష, నేల, సంస్కృతి పట్ల గర్వాన్ని పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘మనదేశంలో కన్నడ వాతావరణాన్ని సృష్టించాలి. దానికోసం ఎవరైనా మీతో ఏ భాషలో మాట్లాడిన మీరు కన్నడలోనే సమాధానం చెప్పాలి’’ అని ఆయన కోరారు. కన్నడ నేలపై తమ జీవితాన్ని నిర్మించుకున్న వారందరూ కన్నడ వాతావరణాన్ని గౌరవించాలని సిద్ధరామయ్య అన్నారు.
కన్నడ నేలపై కన్నడ భాషలోనే మాట్లాడదామని సీఎం ప్రతిజ్ఞ చేశారు. ద్విభాష విధానం కోసం కన్నడ కార్యకర్తల డిమాండ్ పై ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘నేను వ్యక్తిగతంగా ద్విభాషావాదానికి మద్దతు ఇస్తున్నాను. కానీ ద్విభాషా విధానాన్ని చట్టబద్దంగా అమలు చేయాలంటే, దానిని మంత్రివర్గంలో చర్చించాలి’’ అన్నారు.


Tags:    

Similar News