బ్రేకింగ్ న్యూస్ : రతన్ టాటా కన్నుమూత

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త,టాటాగ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Update: 2024-10-09 23:26 GMT

భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, పలు టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా కన్నుమూశారు. ఇటీవల కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు.

రతన్ టాటా మరణాన్ని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. 1887 డిసెంబరు 28వతేదీన ముంబయిలోని నావన్ టాటా, సోనీ దంపతులకు రతన్ టాటా జన్మించారు. కార్నెల్ యూనివర్శిటీ నుంచి బీఆర్క్ లో డిగ్రీ చదివారు.

అనంతరం 1975వ సంవత్సరంలో హార్డర్డ్ బిజినెస్ స్కూలులో అడ్వాన్స్ డ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాం చదివారు. 1962వ సంవత్సరంలో టాటా గ్రూపులో చేరిన రతన్ షాప్ ఫ్లోరులో ఉద్యోగిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ టాటా గ్రూపు ఛైర్మన్ స్థాయికి ఎదిగారు.


ప్రముఖల దిగ్భాంత్రి

‘‘గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోతుంది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు, ఇతను వ్యాపార సామ్రాజ్యంలో చెరగని ముద్ర వేశారు.’’ అని రతన్ టాటాకు హర్ష్ గోయంకా నివాళులు అర్పించారు. రతన్ టాటా మృతి పట్ల పారిశ్రామిక రంగ ప్రముఖలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.


రతన్ టాటాకు ఎన్నెన్నో అవార్డులు

పారిశ్రామిక రంగంలో ఎన్నెన్నో విజయాలు సాధించిన రతన్ టాటాకు 2000 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ లను ప్రదానం చేసింది. ఎందరో పారిశ్రామిక వేత్తలకు రతన్ టాటా స్ఫూర్తిగా నిలిచారు.టాటా గ్రూపును రూ.10వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయలకు చేర్చారు.


దాతృత్వం

రతన్ టాటా తాను సంపాదించిన మొత్తంలో 60 శాతానికి పైగా డబ్బును సేవా కార్యక్రమాలకు కేటాయించారు. దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన రతన్ టాటా కోవిడ్ మహమ్మారి సమయంలో రూ.1500 కోట్లను విరాళమిచ్చారు. టాటా ట్రస్టు కరోనా రోగుల చికిత్సకు పరికరాలు, టెస్టింగ్ కిట్లు అందించింది.


రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

‘‘భారత్ ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయింది. రతన్ టాటా చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం’’అని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రతన్ టాటటా అసాధారణ వ్యక్తి అని ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఆయన నాయకత్వం వహించారని ప్రధాని నరేంద్రమోదీ తన సంతాప సందేశంలో తెలిపారు. మెరుగైన సమాజం కోసం కృషి చేసిన రతన్ టాటా ఎంతోమందికి ఆప్తుడయ్యాడని ప్రధాని ఎక్స్ లో పోస్టు పెట్టారు.

Tags:    

Similar News