కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్‌చార్జ్ రణదీప్ సింగ్ హెచ్చరిక ఏమిటి?

కొంతమంది పార్టీ నాయకులు కాంగ్రెస్ హై కమాండ్‌ను కలవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏమన్నారు?

Update: 2025-11-21 13:38 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక(Karnataka) ఇన్‌చార్జ్ AICC జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా శుక్రవారం (నవంబర్ 21) ఎమ్మెల్యేలు, నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర నాయకత్వం, సీఎం మార్పు విషయాలపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు విధేయుడయిన ఒక రాష్ట్ర మంత్రి, కొంతమంది ఎమ్మెల్యేలు న్యూఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమైన ఒక రోజు తర్వాత సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలు పార్టీలో అధికార పోరాటానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యింది. ఆ తర్వాత రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా పార్టీ(Congress)లోని గ్రూపులిజంపై తనకు నమ్మకం లేదని, కాంగ్రెస్‌కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తన వారని, తాను వారికి అండగా నిలుస్తున్నానని శివకుమార్ పేర్కొన్నారు.

"140 మంది ఎమ్మెల్యేలూ నా ఎమ్మెల్యేలే. ఒక గ్రూపును తయారు చేయడం నా రక్తంలోనే లేదు. ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నారు. అందరూ మంత్రులు కావాలని కోరుకుంటారు. కాబట్టి వారు ఢిల్లీలో నాయకత్వాన్ని కలవడం చాలా సహజం. అది వారి హక్కు. మనం వారిని ఆపలేము. నో అని చెప్పలేము."

"ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటానని చెప్పారు. ఆయనకు శుభాకాంక్షలు. మేమందరం ఆయనతో కలిసి పనిచేస్తాం. సీఎం, నేను ఇద్దరూ హైకమాండ్‌కు కట్టుబడి ఉంటామని పదే పదే చెబుతున్నాము" అని శివకుమార్(DK Shivakumar) ఎక్స్‌లో పేర్కొన్నారు.

మే 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు. అధిష్టానం డీకేను ఒప్పించి ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. రొటేషన్ పద్ధతిలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగినట్లు గతంలో వార్తలొచ్చాయి. తొలుత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్లు పూర్తవుతున్నా శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు పార్టీ అధినాయకత్వం. దాంతో డీకే వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News