బీజేపీ తమిళనాడును గౌరవిస్తూనే ఉందా?
సీపీ రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ఎన్డీఏ;
By : The Federal
Update: 2025-08-18 06:49 GMT
మహాలింగం పొన్నుస్వామి
త్వరలో జరగబోయే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించింది. ఆగష్టు 4న జగదీప్ ధన్ ఖడ్ ఊహించని విధంగా రాజీనామా చేయడంతో ఈసీ సెప్టెంబర్ 9, 2025 ఎన్నికలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పేరును తెరమీదకి తీసుకొచ్చింది.
నాలుగు దశాబ్ధాలకు పైగా ప్రజా సేవ చేసిన అనుభవం ఆయన సొంతం. రాజకీయ నాయకుడిగా రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి చవిచూశారు. రాధాకృష్ణన్ నామినేషన్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే తమిళనాడు ఎన్నికలను ప్రభావితం చేయడానికి, ఎన్డీఏ కూటమి బలం పెంచడానికి ఒక వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు బీజేపీకి బూస్ట్..
‘‘ఇది అందరూ తమిళులకు గౌరవం’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ అన్నారు. ఆయన మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.
‘‘తమిళనాడు సీపీ రాధాకృష్ణన్ తొలిసారిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం చాలా గర్వకారణం. ఏపీజే అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేసిన బీజేపీ, తమిళులను గౌరవిస్తూనే ఉంది.’’ అని నైనార్ ది ఫెడరల్ తో చెప్పారు. ఈ నిర్ణయం దక్షిణ రాజకీయాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచుతుందని అన్నారు.
రాధాకృష్ణన్ బాల్య స్నేహితుడైన బీజేపీ నాయకుడు ఎస్ ఆర్ శేఖర్ మాట్లాడుతూ.. ఆయన చేరువకాగలిగిన, సూత్రప్రాయ నాయకుడని అభివర్ణించారు. ఆయన వినయపూర్వకంగా ప్రారంభం నుంచి ఎదిగారు. ఆయన ఈ స్థాయికి ఎదగడం అపారమైన ఆనందకర క్షణం అని శేఖర్ ‘ది ఫెడరల్’ తో చెప్పారు. అన్నాడీఎంకే తో ఆయనకున్న సంబంధాలు కొంగు సమాజంలో ఆయనకున్న ఆదరణ పార్టీకి పెద్ద ప్లస్ కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
నామినేషన్ తరువాత..
నామినేషన్ తరువాత సీపీ రాధాకృష్ణన్ ‘ ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మా గౌరవనీయులైన ఎన్డీఏ మిత్రపక్షాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి నమ్మకం నాపై ఉంది. నా చివరి శ్వాస వరకూ అవిశ్రాంతంగా దేశానికి సేవ చేయడానికి నన్ను అంకితం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అన్నారు.
తమిళనాడులో తిరప్పూర్ లో అక్టోబర్ 20, 1957 న జన్మించిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ రాజకీయ ప్రయాణం 16 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఆర్ఎస్ఎస్ ఆయన తొలి అనుబంధం బీజేపీకి జీవితాంతం కట్టుబడి ఉండటానికి మార్గం సుగమం చేసింది.
అంచెలంచెలుగా..
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన రాధాకృష్ణన్ 1974 లో భారతీయ జనసంఘ్ లో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా చేరారు. 1996 నాటికి తమిళనాడులో జరిగిన తిరుచ్చి సమావేశంలో బీజేపీలో చేరారు. ఆయన కార్యదర్శిగా నియమితులయ్యారు. తరువాత రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు.
1998, 1999 తో ఆయన కోయంబత్తూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో తనను తాను ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఎంపీగా ఉన్న కాలంలో ఆయన టైక్స్ టైల్స్ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహించారు. ఆర్థిక సంప్రదింపుల కమిటీలో పనిచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల కోసం పార్లమెంటరీ కమిటీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ కుంభకోణాన్ని దర్యాప్తు చేసే ప్రత్యేక కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
భారీ రథయాత్ర..
2004 లో ఆయన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. తైవాన్ కు వెళ్లిన మొదటి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడు. 2003-06 వరకూ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
నదుల అనుసంధానం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, కామన్ సివిల్ కోడ్ అమలు చేయడం వంటి అంటరానితనం, మాదవ ద్రవ్యాల వాడకాన్ని ఎదుర్కోవడం వంటి అంశాల కోసం 19 వేల కిలోమీటర్ల దూరం 93 రోజుల పాటు రథయాత్రను చేపట్టారు. ఆయన వివిధ కారణాల కోసం అదనంగా రెండు పాదయాత్రలకు నాయకత్వం వహించారు. ఇది అతని అట్టడుగు స్థాయి సంబంధాలను బలోపేతం చేసింది.
2016, 2019 ఎన్నికలలో పరాజయాలు ఎదురైనప్పటికీ ఆయన స్నేహశీల ప్రవర్తన, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్దత ఆయనకకు విస్తృత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.
2016-2020 వరకూ ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్ గా రాధాకృష్ణన్ పరిపాలన చతురత ప్రదర్శించారు. ఆ కాలంలో కాయిర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 2,532 కోట్లకు చేరుకున్నాయి.
ఆయన గవర్నర్ పాత్రలు ఆయన ఖ్యాతి మరింతగా పదిలం చేశాయి. ఫిబ్రవరి 2023 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. నాలుగు నెలల్లోనే ఆయన 24 జిల్లాలో ప్రయాణించి పౌరులతో మమేకం అయ్యారు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. జూలై 31, 2024 నుంచి ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు.
టేబుల్ టెన్నిస్ కళాశాల ఛాంపియన్..
ఇక ఆసక్తిగల క్రీడాకారుడు, రాధాకృష్ణన్ టేబుల్ టెన్నిస్ లో కళాశాల ఛాంపియన్, క్రికెట్ వాలీబాల్ లపై ఆసక్తి ఉన్న లాంగ్ డిస్టెన్స్ రన్నర్. యూఎస్, యూకే, చైనా, జపాన్ తో సహ 20 దేశాలు ప్రయాణించాడు. రాధాకృష్ణన్ ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడ(వ్యాపారవేత్త), ఒక కుమార్తె.
వివాదారహితుడు
గత 20 సంవత్సరాలుగా సీపీ రాధాకృష్ణన్ ను అనుసరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ టీ రామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘రాధాకృష్ణన్ చాలా మంచి నిజాయితీ గల నాయకుడు. ఆయన వివాదాలకు అవకాశం ఇవ్వరు. గత కొన్ని సంవత్సరాలుగా జార్ఖండ్, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆయన ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు. ఆయన రాజకీయ చతురత, నైపుణ్యమే ఆయనను అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి కారణమని నేను నమ్ముతున్నాను’’ అన్నారు.
781 మంది సభ్యులు గల ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ 400 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. దీనితో రాధాకృష్ణన్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష ఇండి కూటమి తన అభ్యర్థించడానికి ప్రయత్నిస్తోంది.
రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు ప్రధాని నాయకత్వంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పలువురి పేర్లు చర్చలోకి వచ్చాయి.
చివరకు సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తాయని, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.