టాస్మాక్ స్కాం: 'పార్టీ ఫండ్'పై ఈడీ దర్యాప్తు

రాజకీయ నాయకులు, అధికారుల వసూలు చేసిన డబ్బులో ఎక్కువ భాగం 'పార్టీ ఫండ్'కి వెళ్లిందని ఈడీ అనుమానిస్తోంది.;

Update: 2025-05-18 12:20 GMT
Click the Play button to listen to article

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కాంలో 'పార్టీ ఫండ్'ను ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఈడీ ఫోకస్ పెట్టింది. రాజకీయ నాయకులు, అధికారులు భారీ మొత్తంలో డబ్బు స్వాహా చేశారని, అలా చేసిన డబ్బులో ఎక్కువ భాగం 'పార్టీ ఫండ్'కి వెళుతుందని ఏజెన్సీ అనుమానిస్తోంది. ప్రైవేట్ డిస్టిలరీలు ఆర్డర్‌లను పొందడానికి 'పార్టీ ఫండ్'తో సహా వారి కాంట్రాక్ట్ విలువలో 10-20 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. AIADMK పాలనలో MIDAS, MB డిస్టిలరీస్ వంటి రాజకీయ మద్దతు ఉన్న డిస్టిలరీలు మాత్రమే పెద్ద ఆర్డర్‌లను పొందాయని ED దర్యాప్తులో బయటపడింది. DMK అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీలను పక్కన పెట్టడం లేదా ఇతరులతో విలీనం చేయడం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

'పార్టీ ఫండ్'ను ఎవరు నిర్వహిస్తున్నారో? ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడానికి ED ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ఇటీవలి టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ విశాకన్ ఐఏఎస్, చిత్ర నిర్మాత ఆకాష్ బాస్కరన్, ఆ ఫండ్‌ను నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న మరొక వ్యక్తి రతీష్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. మనీలాండరింగ్ ఆపరేషన్ మొత్తాన్ని దశలవారీగా నిర్వీర్యం చేస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది.

క్యాష్ ఫర్ జాబ్ కుంభకోణంలో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించిన మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీకి నేరుగా సంబంధం లేనప్పటికీ.. ఆయన లేనప్పుడు పార్టీ నిధిని ఎవరు నియంత్రించారనే దానిపై ED దర్యాప్తు చేస్తోంది. భాస్కరన్, రతీష్‌లపై ఆరోపణలకు తగిన ఆధారాలు దొరికాయా లేదా అన్నది దాడులు ముగిసి అధికారిక ప్రకటన విడుదలైన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.

ఈడీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది: డీఎంకే

ఈ కుంభకోణం తమిళనాడు రాజకీయ, వ్యాపార వర్గాలను కుదిపేసినప్పటికీ, డీఎంకే(DMK) తన పాత్రను ఖండిస్తోంది. డీఎంకే ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడులు జరిగాయని డిఎంకె ప్రతినిధి జె కాన్స్టాండైన్ రవీంద్రన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన సోదాలు ఏమైనా ఫలితాలను ఇచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు, ఈ చర్యలు డీఎంకే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే ఉద్దేశించినవి తప్ప మరొకటి కాదన్నారు.

 

Tags:    

Similar News