‘తమిళనాడులో విద్యా ప్రమాణాలు తక్కువ’

విద్యా వ్యవస్థపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలకు రాజకీయ నాయకులు కౌంటర్ కూడా ఇచ్చారు.

Update: 2024-09-06 08:49 GMT

తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలకు రాజకీయ నాయకులు కౌంటర్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి పేర్కొ్న్నారు. రాజ్‌భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులంతా సులభంగా డిగ్రీలు పొందడం వల్ల ఉద్యోగాలు పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

గవర్నర్ వ్యాఖ్యలపై రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన మరో కార్యక్రమంలో గవర్నర్‌ పేరు ప్రస్తావించకుండానే ఉదయనిధి మాట్లాడుతూ.. 'మా పాఠశాల విద్యా పాఠ్యాంశాలపై ఓ వ్యక్తి విమర్శలు చేశారు. విద్యార్థులను సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించే విద్యావిధానమే అత్యుత్తమం. ఈ అంశంలో చూస్తే.. తమిళనాడు విద్యా విధానం భారతదేశంలోనే అత్యుత్తమమైనది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఇతర రంగాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. 'ఇస్రో కోసం తమిళనాడు వీరముత్తువేల్, మైల్‌స్వామి వంటి శాస్త్రవేత్తలను తయారు చేసింది. మన విద్యావ్యవస్థపై ఎలాంటి విమర్శలను మేము అంగీకరించం. అలాంటి విమర్శలు మా ఉపాధ్యాయులను, విద్యార్థులను అవమానించడమే' అని ఉదయనిధి అన్నారు. విద్యార్థుల శ్రేయస్సుపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా ఆలోచించారని, తదనుగుణంగా తగిన కార్యక్రమాలను ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. 

Tags:    

Similar News