ఈడీ ముందుకు మాజీ మంత్రి భార్య

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌ కుంభకోణానికి సంబంధించి ఈడీ విచారించిన మాజీ మంత్రి భార్య ఎవరు? ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి?

Update: 2024-07-17 10:27 GMT

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్‌ రూ.187 కోట్ల కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి బి.నాగేంద్ర భార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ప్రశ్నించింది. కార్పొరేషన్‌లో ఆర్థిక అవకతవకలపై ప్రశ్నించాల్సి ఉందని ఈడీ అధికారులు నాగేంద్ర భార్య మంజులను విచారణకు పిలిచారు. నాగేంద్ర ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మే 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన డెత్ నోట్‌ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ ఆ లేఖలో వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ రెండూ వేర్వేరుగా విచారణ జరుపుతున్నాయి.

ఆరోపణల నేపథ్యంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర జూన్ 6న రాజీనామా చేశారు. ఈడీ గతంలో రాయచూరు రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్‌పై దాడులు నిర్వహించింది.

Tags:    

Similar News