తొక్కిసలాటకు ఇక నుంచి నిర్వాహకులదే బాధ్యత
కరూర్ తొక్కిసలాట జరిగిన తరువాత కళ్లు తెరిచిన తమిళనాడు ప్రభుత్వం
By : The Federal
Update: 2025-10-08 06:27 GMT
మహాలింగం పొన్నుస్వామి
సినిమా నుంచి రాజకీయాలల్లోకి ప్రవేశించిన కోలీవుడ్ నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో 40 మందికి పైగా ప్రాణాలు వదిలిన తరువాత తమిళనాడు ప్రభుత్వం కళ్లు తెరిచింది.
ఇక నుంచి ఎన్నికల ర్యాలీలు నిర్వహించే అంశంపై కఠినమైన నిబంధనలు విధించింది. మహిళలకు కచ్చితంగా ప్రత్యేకంగా స్థలం కేటాయించడంతో పాటు, 12 ఏళ్ల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితులలో ర్యాలీకి రాకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ ర్యాలీలలో ఏదైన ప్రాణనష్ట జరిగితే దానికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని నిబంధనలు తీసుకువచ్చింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కరూర్ ఘటన దృష్ట్యా ప్రజల భద్రత కోసం కఠినమైన నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ను ఈ సన్నాహాలను వేగవంతం చేయడానికి మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ‘ది ఫెడరల్’ కు చెప్పారు.
బాధ్యులు ఎవరో నిర్ధారణ..
నటుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన సెప్టెంబర్ 27 నాటి ఎన్నికల ర్యాలీ అనంతరం జరిగిన తొక్కిసలాట పై ప్రభుత్వం రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు జడ్జీ జస్టిస్ అరుణ జగతీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.
ఈ విచారణను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం-1952 నిబంధనల ప్రకారం జరగనుంది. తొక్కిసలాటకు గల కారణాలు, దాని బాధ్యులు ఎవరనే దానిపై కమిషన్ విచాణ చేయనుంది. అనంతరం ప్రభుత్వానికి అవసరమైన చర్యలకు సిఫార్సు చేస్తుంది. ముఖ్య నిబంధనలు..
1) ఈ విషాదానికి దారితీసిన లోపాలు, ప్రజల మరణాలు, అనేక మంది గాయపడటం వంటి వాటికి బాధ్యత వహించడం
2) అనుమతి కోరిన నిర్వాహకులు నిబంధనలు పాటించారా లేదా
3) రాజకీయా పార్టీల సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు మంజూరు చేయడానికి మార్గదర్శకాల అధ్యయనం, ప్రజా జీవితానికి రక్షణ కల్పించడం
4) భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారణ చర్యలు సూచించడం
రోడ్ షోలు నిషేధం..
నోటిఫికేషన్ ను జారీ చేసిన మూడు నెలల లోపు విచారణ పూర్తి చేసి, ఇంగ్లీష్, తమిళ భాషలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఆదేశించింది. దీనికోసం ప్రభుత్వం 1952 చట్టంలోని సెక్షన్ 5 లోని (2),(3),(4),(5) నిబంధనలు అమలు చేసింది. సాక్షులను పిలిపించడం, హజరుకు సంబంధించి విస్తృత అధికారాలను కమిషన్ కు మంజూరు చేసింది.
ఇటీవల మైలురాయి తీర్పులో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ జాతీయ, రాష్ట్ర రహదారులపై రాజకీయ ప్రచారానికి లేదా ర్యాలీలకు అనుమతి ఇవ్వరాదని ఆదేశించింది. భవిష్యత్ లో ప్రమాదాలను నివారించాలంటే ఇటువంటి చర్యలు తప్పనిసరని పేర్కొంది.
ముఖ్యంగా సమగ్ర మార్గదర్శకాలు, ప్రోటోకాల్ లను రూపొందించే వరకూ పోలీసుల ఏ పార్టీ సమావేశాలు లేదా సమావేశాలను నిర్వహించడానికి అనుమతులను నిలిపివేస్తామని ప్రభుత్వం కూడా కోర్టుకు హమీ ఇచ్చింది.
రాజకీయ ప్రచారం..
కరూర్ విషాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. నాయకులు తమ ప్రచార వ్యూహాలను పునరాలోచించుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళని స్వామి తిరుచెంగోడ్, కుమారపాళయం, నామక్కల్, పరమతివెల్లూర్ లలో బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి నిరాకరించబడింది.
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వూలను పోలీసులు ఉదహరించారు. పార్టీ వేదికలకు అనుమతులు ఇవ్వకుండా ఇది అడ్డుకుంటుందని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక పోలీసులను సంప్రదించినప్పుడూ ఇలాంటి తొక్కిసలాట ప్రమాదాలను నివారించడానికి కోర్టు ఆదేశాలను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ‘‘ఉల్లం తేడీ, ఇల్లం నది’’ (హృదయాలను చేరుకోవడం, ఇళ్లను సందర్శించడం) డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్ కాంత్ గతవారం కృష్ణగిరిలో రోడ్ షో నిర్వహించడానికి కూడా అడ్డంకులు ఎదుర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. కొత్త బస్టాండ్ సమీపంలోని చేయాల్సిన రోడ్ షోను పోలీసులు నిలిపివేశారు. అయితే అన్నాదురై విగ్రహం దగ్గర మాత్రం బహిరంగ నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలిపారు.
నెల్లైలో పీఎంకే నాయకుడు అన్భుమణి రాందాస్ ప్రణాళిక వేసుకున్న పాదయాత్రను పూర్తిగా తిరస్కరించారు. పోలీసులు కరూర్ ఘటనను ఉదహరిస్తూ అనుమతి ఇవ్వలేదు.
దీనిపై రామదాస్ నిరాశను వ్యక్తం చేశారు. హైవే కార్యక్రమాలపై నిషేధం అతిగా అమలు చేస్తున్నారని, అట్టడుగు వర్గాల ప్రచారానికి అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. ‘‘భద్రత అత్యంత ముఖ్యమైనదే అయినప్పటికీ, ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు అయ్యే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి’’ అని ఆయన అన్నారు.