కర్నాటక: మోదీ పర్యటన కాంగ్రెస్ కు బలం చేకూర్చిందా?

ఎన్నికల్లో బీజేపీ హిందూత్వ అంశాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కులం కార్డును ప్రయోగించాలని ప్రణాళిక వేసుకుంది. ఇప్పటికే కర్నాటక ప్రైడ్ అంటూ..

Update: 2024-04-18 06:27 GMT

కర్నాటకలో లోక్‌సభ పోరు ప్రారంభం కావడానికి కేవలం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే గత ఎన్నికల్లో మాదిరి బీజేపీ ఈ సారి ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం లేదని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తే బీజేపీ గందరగోళంగా ఉన్నట్లుగా కనిపిస్తే.. కాంగ్రెస్ నమ్మకంగా ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తప్ప రాష్ట్ర బీజేపీకి ఓట్లు తెచ్చిపెట్టే నాయకత్వం.. రాజకీయ వ్యూహం కనిపించడం లేదు. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటున్న వ్యూహాలకు తగ్గట్టుగానే తమ ఆలోచనలు అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయని కర్ణాటకలోని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు.
బీజేపీకి కష్టమే
"కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో గత ఎన్నికల్లో 25 స్థానాలను గెలుచుకున్నాం. అయితే మునుపటిలా పరిస్థితిమాత్రం లేదు. ఇప్పుడు తీవ్రంగా పోరాటం చేస్తున్నాం" అని ఒక సీనియర్ బిజెపి కార్యకర్త ది ఫెడరల్‌తో అన్నారు. జేడీఎస్ తో పొత్తు తరువాత పరిస్థితిలో పెద్ద మార్పులేదని , ఐక్యత కొరవడం, రెండు పార్టీల కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీకి ఎక్కువగా నష్టం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రాల్లో బీజేపీ నాయకులకు తిరుగుబాట్లు కొంతమేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుమారుడు బీవై విజయేంద్రకు ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి.
మోదీ ఫ్యాక్టర్
మైసూరు, మంగళూరులో మోదీ పర్యటన తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని ఆశించిన కమల దళానికి ఇప్పుడు నైరాశ్యం ఆవహించింది. ప్రాంతీయవాదం, సమాఖ్యవాదం, హామీలు, పన్నుల పంపిణీలో తగ్గుదల, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కారణంగా కర్ణాటకకు ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కొనేందుకు మోదీ మేనియా తమకు కొత్త ఆయుధం ఇస్తుందని స్థానిక నాయకులు ఎదురు చూశారు. అయితే, మోదీ మైసూరులో హిందుత్వ కార్డును బయటకు తీసి సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ఇండి కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కర్ణాటక ఆత్మ..
“కర్ణాటకపై వివక్షతో పాటు నదీ జలాల వివాదాలకు సంబంధించిన సమస్యలపై మోదీ ఏదైన మాట్లాడుతారేమో అని కాంగ్రెస్ ఎదురుచూసింది. కానీ రాష్ట్రంలో బర్నింగ్ సమస్యలపై మోదీ మౌనం వహించారు. వీటిపై కాకుండా హిందూత్వ అంశాన్ని మాత్రమే మాట్లాడడం తమకు లాభిస్తుందని ఓ కాంగ్రెస్ కార్యకర్త ఫెడరల్ తో అన్నారు.
కాంగ్రెస్ వర్గాల ప్రకారం, ఆ పార్టీ ఇప్పుడు “కర్ణాటక ప్రైడ్”, “నా పన్ను, నా హక్కు”ని ప్రధాన ఎన్నికల ప్రచారంగా మార్చింది. అంతేకాకుండా హిందూత్వ ఎజెండాను కుల గణనతో ఎదుర్కోవాలని కాంగ్రెస్ ప్రణాళిక.
ఆధిపత్య పక్షాలు
ప్రధాన రాజకీయ పార్టీల లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపు లింగాయత్, వొక్కలిగ వర్గాలకు అసమానంగా కేటాయించారనే వాటిపై రాష్ట్రంలో వివాదానికి దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ-జేడీ(ఎస్) కూటమి దాదాపు సగం టిక్కెట్లను ఈ రెండు ఆధిపత్య వర్గాలకు కేటాయించింది. కాంగ్రెస్ ఐదుగురు లింగాయత్‌లు, ఏడుగురు వొక్కలిగాలను నిలబెట్టగా, బీజేపీ, జేడీ(ఎస్)లు తొమ్మిది లింగాయత్‌లు, ఐదు వొక్కలిగాలను బరిలో నిలిపాయి. వొక్కలిగాలు, లింగాయత్‌ల జనాభా 27 శాతం మాత్రమే అయినప్పటికీ వారి ప్రాతినిధ్యం మాత్రం 65 శాతానికి మించి ఉంది.
బీజేపీకి ఎదురుదెబ్బ..
అభ్యర్థుల ఎంపికపై చెలరేగిన అసంతృప్తితో బీజేపీ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ మమ్మల్నీ తీవ్రంగా అవమానించిందని వీరశైవ-లింగాయత్‌ వర్గం భావిస్తోంది. జేడీ(ఎస్)తో జతకట్టడం ద్వారా వొక్కలిగ సామాజికవర్గం, మైనారిటీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు పాక్షికంగా విఫలమయ్యాయని తెలుస్తోంది. ఒక్కలిగ వర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాషాయపార్టీని స్వయంగా ఢీ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. మరికొన్ని పరిణామాలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతున్నాయి.
సీఎం సిద్ధరామయ్య రాష్ట్రంలోని మైనారిటీలు, దళితులు, వెనకబడిన వర్గాలను తమ వైపు తిప్పుకోవడాకిని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దళిత నాయకుడు వి శ్రీనివాస్ ప్రసాద్ కాంగ్రెస్ పట్ల తన వైఖరిని పాజిటివ్ గా మార్చుకున్నారు మైసూరులో మోదీ ర్యాలీకి హాజరు కాలేదు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వొక్కలిగ సీర్ ఫోన్ ట్యాపింగ్ చేయడం పలువురిని కలవరపెడుతోంది.
మఠం వర్సెస్ బీజేపీ
పంచమసాలీ (వీరశైవ-లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఒక ప్రధాన మఠం) సీర్ బిజెపి అభ్యర్థులను మఠంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. పార్టీని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 17 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు ఇవన్నీ లాభించేలాగా కనిపిస్తున్నాయి. హరిహర్‌లోని వీరశైవ లింగాయత్ పంచమసాలీ గురు పీఠం అధిపతి వచనానంద స్వామి ఫెడరల్‌తో మాట్లాడుతూ, మఠంలోకి బిజెపి అభ్యర్థుల ప్రవేశంపై నిషేధాన్ని ధృవీకరించారు.
బీజేపీ ఎంపీ రాజీనామా
మరోవైపు వీరశైవ లింగాయత్ వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు సిద్ధరామయ్య తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 160 మందికి పైగా లింగాయత్ మఠాధిపతులు ఆయనను సన్మానించారు. సిద్ధరామయ్య బసవన్నను సాంస్కృతిక రాయబారిగా ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొప్పల్‌కు చెందిన బీజేపీ ఎంపీ కరడి సంగన్న ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారు. అతను పంచమసాలీ ఉపవర్గం నుండి శక్తివంతమైన లింగాయత్ నాయకుడు. ఇది కాంగ్రెస్‌కు అదనపు వరంగా మారింది.
వొక్కలిగ గుండెకాయ
సిద్ధరామయ్య - శివకుమార్ ఇద్దరూ కర్ణాటకలోని వొక్కలిగ అభ్యర్థులను నిలబెట్టారు. పాత మైసూర్ లో ఉన్న 14 స్థానాలకు గానూ 11 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులనే నిలబెట్టారు. వొక్కలిగ నడిబొడ్డున జరుగుతున్న ఆధిపత్య పోరును పరిశీలిస్తే, శివకుమార్ తన ప్రత్యర్థి కుమారస్వామిపై పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆదిచుంచనగిరి మఠం అధిపతి నిర్మలానంద స్వామి టెలిఫోన్ ట్యాప్ చేశారని శివకుమార్ ఆరోపిస్తూ కుమారస్వామిని వొక్కలిగ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు.
దళితుల ఓట్లన్నీ ఆ పార్టీకే..
ఇదిలావుండగా, కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో దళితుల ఓట్లు ఏడు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీకి ఊపునిస్తాయని సూచిస్తున్నాయి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇలా అన్నారు: "కర్ణాటకలో దళితుల ఏకీకరణ జరగబోతోంది, ఇది కాంగ్రెస్‌కు బలాన్ని ఇస్తుంది." రాయచూర్, బళ్లారితో పాటు కలబురగి, విజయపుర, చిత్రదుర్గ, కోలార్, చామరాజనగర్‌లలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈ కన్సాలిడేషన్ పని చేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు ఎల్.హనుమంతయ్య ది ఫెడరల్‌తో అన్నారు.
హిందుత్వ వర్సెస్ కులం
కర్నాటక ప్రభుత్వం తమకు తక్కవ శాతం పన్నులు రాబడి కేంద్రం నుంచి వస్తోందనే అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చింది. మోదీ స్వయంగా హిందుత్వ, రామమందిరం సమస్యలను లేవనెత్తినప్పుడు, కాంగ్రెస్ హిందూత్వ కథనాన్ని కుల కథనంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకుందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు.
Tags:    

Similar News