పశ్చిమ కనుమలను కాపాడేందుకు సిద్ధమైన యోధులు.. వారు ఎవరూ?

కర్నాటకలో ఎక్కువ భాగం విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతాన్ని కాపాడటానికి రాష్ట్రంలోని పర్యావరణ ప్రేమికులు ఏకమయ్యారు. గాడ్గిల్ నివేదికలోని అంశాలను..

Update: 2024-08-14 07:39 GMT

దేశంలోనే పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా పేరు పొందిన పశ్చిమ కనుమలను కాపాడటానికి పర్యావరణవేత్తలు నడుంబిగించారు. ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్( ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉంది.. ఇక్కడ రాష్ట్రంలోకి రావాలంటే ముందస్తు అనుమతి అవసరం) వంటి నిబంధనలు తీసుకురావాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుతున్నారు.

వయనాడ్ విపత్తులు, కర్నాటకలో నిరంతరం విరిగిపడుతున్న కొండచరియలు వీరిని ముందడుగు వేసేలా చేశాయి. వీరంతా ముక్తకంఠంతో 2011 నాటి మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ చార్టర్ అయిన “పరిసరక్కగి నావు” (మేము పర్యావరణం కోసం) అనే సంస్థను ఏర్పాటు చేసి పలు డిమాండ్లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాయి.

అవగాహన అవసరం
జనవరిలో స్థాపించబడిన పరిసరక్కగి నావులో కర్నాటక లోని పర్యావరణ ప్రేమికులు ఉన్నారు. పశ్చిమ కనుమల్లోని అతిపెద్ద భాగం కర్ణాటకలో విస్తరించి ఉంది. మిగిలిన భాగాలు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లో ఉన్నాయి. ఈ పర్యావరణ నిధిని కాపాడటానికి, తదుపరి విషాదాన్ని నివారించడానికి కర్నాటక తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఈ చార్టర్ ఇప్పుడు అన్ని జిల్లాల్లో యూనిట్లు స్థాపించింది. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన పద్ధతులకు అంకితమైన వ్యక్తులను ఒకచోట చేర్చింది.
గాడ్గిల్ గైడ్స్ గ్రూప్
యాదృచ్ఛికంగా, ఈ బృందానికి 2011 నివేదిక రూపశిల్పి, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి పర్యావరణ శాస్త్రవేత్త అయిన మాధవ్ గాడ్గిల్ స్వయంగా మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఇతర సభ్యులు ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త TV రామచంద్ర ఉన్నారు. ఈ బృందం ప్రకృతితో పాటు మానవ జీవితాలను రక్షించడానికి త్వరిత చర్యను కోరుతోంది.
ILP అవసరం
ఈ బృందంలో భాగమైన ప్రముఖ పర్యావరణవేత్త అఖిలేష్ చిప్పల్లి పశ్చిమ కనుమల దోపిడీని అరికట్టడానికి ILPని ప్రతిపాదించారు. కర్ణాటకలోని 10 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఘాట్‌ల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలను నియంత్రించేందుకు ILP సహాయం చేస్తుందని అఖిలేష్ ది ఫెడరల్‌తో చెప్పారు. ILP, ఈశాన్య ప్రాంతంలో అనుసరించే మాదిరిగానే ఇక్కడ నిబంధనలు విధించాలని కోరుతున్నారు.
"వలసదారులు పశ్చిమ కనుమల ప్రాంతాన్ని పెద్ద సంఖ్యలో ఆక్రమించుకున్నారు, ఇది ప్రబలమైన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు దారితీసింది. అటవీ విస్తీర్ణంలో భయంకరమైన తగ్గింపుకు దారితీసింది. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడానికి ఘాట్‌ల పొడవునా ఐఎల్‌పి మోడల్‌ను తీసుకురావాలి,” అని చిప్పల్లి శ్రీకాంత్ వివరించారు.
స్థానికులకు సందేశం
మరో ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత, జర్నలిస్ట్ నగేష్ హెగ్డే, ఈ బృందంలో సభ్యుడు కూడా, అతను ప్రభుత్వానికి చేసిన సిఫార్సుపై ది ఫెడరల్‌తో మాట్లాడారు.
"గాడ్గిల్ నివేదిక సరళమైన సమగ్ర సారాంశాన్ని రూపొందించే ఉద్దేశ్యంతో  ఓ ప్రతిపాదన చేశారు.  ప్రభుత్వ ప్రతినిధి, పర్యావరణ శాస్త్రవేత్త, రాజకీయ పార్టీ ప్రతినిధి, పర్యావరణ కార్యకర్త, జర్నలిస్టులతో కూడిన ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని నేను సూచించాను.” అని వివరించారు.
కమిటీ సరళమైన, అర్థమయ్యే భాషలో ఒక హ్యాండ్‌బుక్‌ను తీసుకొస్తుంది. దీనిని పశ్చిమ కనుమల పరిధిలోకి వచ్చే అన్ని తాలూకాలలో పంపిణీ చేయాలని కోరుతున్నారు.
రాష్ట్రాల ఖర్చు..
" గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ నివేదికలను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ముఖ్యంగా గాడ్గిల్ కమిటీ సిఫార్సు చేసిన అనేక వాటిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే కస్తూరి రంగన్ కమిటీని నియమించాల్సిన పరిస్థితి.
గాడ్గిల్ తన 2011 నివేదికలో 1,29,037 చ.కి.మీ పర్వత శ్రేణిలో 75 శాతాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతం (ESA)గా కవర్ చేయాలని సిఫార్సు చేశారు. ఆరు పశ్చిమ కనుమ రాష్ట్రాలు ఇప్పుడు 10 సంవత్సరాలుగా ESA ముసాయిదా ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నాయి. సంవత్సరాలు గడిచిన కొలది ఇక్కడి పర్యావరణం గాడితప్పుతోంది. 
గాడ్గిల్ నివేదికను సమర్థించారు
శనివారం (ఆగస్టు 10), ఈ సమస్యపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు పరిసరక్కగి నావు బెంగళూరులో సమ్మేళనం నిర్వహించారు. 200 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన వయనాడ్ కొండచరియలు పశ్చిమ కనుమల రాష్ట్రాల నిష్క్రియాత్మకతను పూర్తిగా గుర్తు చేస్తున్నాయని ప్యానెలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.
సదస్సులో గాడ్గిల్ మాట్లాడుతూ.. తన నివేదికలోని సిఫార్సులు అమలు కావడం లేదని తప్పుడు అభిప్రాయం ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. నివేదికను కూడా అధ్యయనం చేయకుండా కొట్టి వేశారని ఆరోపించారు.
టూరిజం..
ఈ నివేదికలోని సిఫార్సులను అమలు చేస్తే పశ్చిమ కనుమల్లో విపత్తులను నివారించవచ్చని ఆయన అన్నారు. "పశ్చిమ కనుమలలోని సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలలో పర్యాటకం పేరుతో అనేక కార్యకలాపాలు, రిసార్ట్‌ల నిర్మాణాలు జరిగాయి. వీటి వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి" అని ఆయన అన్నారు. "ఇలాంటి కార్యకలాపాలను నిషేధించాలి." అని కోరారు. కొండచరియలు విరిగిపడటం లో ఎక్కువ మంది పేదలు, చిరుద్యోగులు బలవుతున్నారు. వయనాడ్ లో మరణించిన వారిలో ఎక్కువ మంది తక్కువ జీతానికి పని చేస్తున్నవారే’’ అని వివరించారు.
కొనసాగుతున్న విపత్తులు..
విధ్వంసం కారణంగా వాయనాడ్ అందరిని దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఈ రుతుపవనాల కారణంగా కొండచరియలు విరిగిపడి కర్ణాటకను కూడా దెబ్బతీస్తూనే ఉన్నాయి.
తాజాగా కర్నాటకలో కూడా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడిన సంఘటన చోటుచేసుకుంది. మైసూరు డివిజన్‌లోని యెడకుమేరి, కడగరవల్లి సెక్షన్ మధ్య జులై 26న బెంగళూరు-మంగళూరు రైల్వే లైన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక్కడ ట్రాక్ పునరుద్ధరణను 10 రోజులకు పైగా పట్టింది. పునరుద్ధరణ జరిగిన రెండు రోజుల్లోనే, మరోసారి కొండచరియలు విరిగిపడటం వల్ల అంతరాయం ఏర్పడి, బెంగళూరు.. కర్ణాటకలోని తీరప్రాంత జిల్లాల మధ్య సేవలను మళ్లీ ప్రభావితం చేసింది.
Tags:    

Similar News