కర్నాటక బీచ్ లో భూతం... విజిటర్లకు ఎలెర్ట్
దక్షిణ కర్నాటలోని ఉల్లాల్ బీచ్ లో దెయ్యం తిరుగుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని..
దక్షిణ కన్నడలోని ఉల్లాలా బీచ్ నుంచి సముద్రంలో వెళ్లరాదని హెచ్చరిస్తూ వేసిన ఓ ఫ్లెక్సీ వెలిసింది. కర్నాటకలో వైరల్ గా మారింది. బీచ్ లో సరదాగా గడపడానికి వస్తున్న పర్యాటకుల్లో కొందరు ఆ మధ్యన సముద్రంలో మునిగి చనిపోయారు. దీనికి కారణం అక్కడ సైతాన్ తిరుగుతోందని కొంతమంది స్థానికలు బలంగా నమ్ముతున్నారు.
ముస్లింల ఆధ్యాత్మిక కేంద్రం ఉల్లాల్ మదానీ దర్గాకు రంజాన్ పండగ ముగిసిన తరువాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే కుటుంబాలతో వచ్చే కొందరు ఇక్కడ బీచ్ లో సేదతీరుతూ ఉంటారు. అక్కడి ఆహ్లాదకరమయిన వాతావరణం వల్ల చీకటి పడ్డాకా కూడా ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడరు. కొందరయితే చీకట్లో సముద్ర స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే, ఆ మధ్య ఇలా సముద్ర స్నానం ప్రయత్నించి చాలామంది మృత్యువాత పడ్డారు. ఇదే భూతానికి దారి తీసింది.
మగ్రిబ్ కు ముందే (సూర్యాస్తమయాన్ని ముస్లింలు మగ్రిబ్ అంటారు) ఇక్కడ నుంచి వెళ్లిపోండి. సైతాన్ కుతంత్రం కారణంగా చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. అలాగే కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారని ప్లెక్సీలో హెచ్చరించారుముస్లింలు చేసే ఐదు ప్రార్థనల్లో మగ్రిబ్ నాలుగోది. ఆ సమయంలో సముద్రాన్ని చూడడం ముస్లింలు పూజగానే భావిస్తారు. నీళ్బలోలకి దిగేందుకు ప్రయత్నిస్తారు. కొందరు ఆ చీకట్లో స్నానం చేస్తారు. ఇది మునిగిపోయి మరణించేందుకు కారణమవుతూ ఉంది. అందువల్ల భూతాన్ని చూపి ప్రజలు చీకటి పడకముందే వెళ్లిపోవాలని ముస్లిం పెద్దలు భావిస్తున్నారు.
ఇక్కడ భూతం తిరుగుతూ ఉందని, నీళ్లలో దిగకుండా కేవలం కళ్లతోనే పూజలు చేసి చీకటి పడకముందే ఉల్లాల బీచ్ ను వదిలివేయాలని మనవి అని ఈ ఫ్లెక్సీ విజిటర్లను కోరుతూ ఉంది.