యూపీ సీఎం లక్ష్యంగా ‘లష్కరే తోయిబా’ కుట్రలు
తమిళనాడు లో బీహార్ వాసీ అరెస్ట్, ఆయుధాల కొనుగోలు కోసం పెయింటర్ గా దినసరి కూలీ అవతారం;
By : The Federal
Update: 2025-08-19 05:41 GMT
మహాలింగం పొన్నుస్వామి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ టార్గెట్ గా ఇస్లామిక్ జిహాదీ మూకలు కదులుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంటలిజెన్స్ వర్గాలు. తాజాగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) కార్యకర్త, బీహార్ కు చెందిన 22 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది.
బీహార్ లోని కతిహార్ జిల్లాలోని బరారీ గ్రామానికి చెందిన అఖ్లతూర్ ముహ్మద్ ఈ కుట్రకు మూలంగా గుర్తించారు. నిందితుడు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని ఒక నిర్మాణ స్థలంలో దినసరి వేతన పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరిక తరువాత ఏప్రిల్ 26న రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది.
ఆయుధాల కొనుగోలు..
ఎన్ఐఏ అధికారుల ప్రకారం.. అరెస్ట్ చేయబడిన వ్యక్తి వార్తలను నిశితంగా అనుసరిస్తాడు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ఉగ్రవాద అంశాలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు.
తన ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సు పూర్తి చేసిన తరువాత అతను ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన గ్రామంలో పరిమిత ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండటంతో రాష్ట్రం తనకు మరింత స్థిరమైన పనిని, మెరుగైన వేతనాలను అందిస్తుందని నమ్మి, ఉపాధి కోసం తమిళనాడుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఎన్ఐఏ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద అనుమానితుడు తన హింసాత్మక లక్ష్యాన్ని కొనసాగించడానికి తన ఆదాయంలో కొంతభాగాన్ని ఆదా చేయడం ప్రారంభించాడు. తన మొత్తం సంపాదనలో దాదాపు 40 శాతం ఆయుధాలను సంపాదించడానికి మళ్లించాడని తెలిసింది.
ఎన్ఐఏ నివేదిక ప్రకారం.. తమిళనాడులో ఒక అనుమానితుడు తన హింసాత్మక ఉద్దేశాలను కొనసాగించడానికి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయడం ప్రారంభించాడు. తన మొత్తం సంపాదనలో దాదాపు 40 శాతం ఆయుధాలను కొనుగోలు చేయడానికి మళ్లించాడని తెలిసింది.
ఆదిత్యనాథ్ ను చంపడానికే ఆయుధాలు..
సీనియర్ అధికారుల ప్రకారం.. ప్రాథమిక విచారణలో తమిళనాడులో ఆయుధాల కొనుగోలు కోసం నిధులు సేకరించడమే తన ప్రాథమిక లక్ష్యం అని, అంతిమ లక్ష్యం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని హత్య చేయడమే అని అఖ్లతూర్ అంగీకరించాడు.
‘‘అతను తమిళనాడులో ఎవరిని హానీ చేయనప్పటికీ అతని ప్రధాన దృష్టి సంపాదించడం, తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి రహస్యంగా డబ్బు వసూలు చేయడం’’ అని ఒక అధికారి చెప్పారు.
ఎల్ఈటీ నెట్ వర్క్ కింద ఆయుధ శిక్షణ పొందడానికి అఖ్లతూర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) కు వెళ్లడానికి ప్రయత్నించాడని ఎన్ఐఏ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడానికి రూ. 50 నుంచి 60 వేలు సంపాదించడని సమాచారం.
ఇందుకోసం ఐదు నుంచి ఆరు మార్గాలలో సరిహద్దు అవతల ఉన్న లష్కరే తోయిబా రిక్రూటర్లు, హ్యండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అఖ్లతూర్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ను ఎన్ఐఏ సైబర్ ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం.. పీఓకే లోని భారత వ్యతిరేక గ్రూపులు అతన్ని క్రమపద్దతిలో తీవ్రవాదం వైపు మళ్లించారని తేలింది.
‘‘అతడికి నిరంతరం ప్రతికూల ప్రచారం, బాంబు పేలుళ్ల వీడియోలు, భారత్ లో మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు జరుగుతున్నాయని కల్పిత నివేదికలు అందించారు’’ అని ఒక అధికారి తెలిపారు.
‘‘ఇటీవల, హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని మసీదులను టార్పాలిన్ షీట్లతో కప్పేస్తున్నారనే వార్తలను అతనితో పంచుకున్నారు. ఇది యూపీ ముఖ్యమంత్రిపై అతను హింసాత్మక లక్ష్యంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పీఓకే, ఇతర దేశాలలో జరుగుతున్న వాటిని భారత్ లో జరిగినట్లుగా అతనికి తప్పుగా చూపించారు’’ అని చివరగా తేలింది.
ఇస్లామిక్ స్టేట్ తో కూడా..
ఎన్ఐఏ అధికారులు అతని వద్ద నుంచి ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన పత్రాలు, సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు బీహార్, తమిళనాడు రెండింటిలోనూ అతని స్థానిక పరిచయాలను గురించి ఆరా తీస్తున్నారు. నిధుల కోసం క్రిప్టో కరెన్సీ మార్గాలను ఉపయోగించారా లేదా అని పరిశీలిస్తున్నారు.
త్వరలోనే వివరణాత్మక చార్జీషీట్..
ఉగ్రవాదం గురించి దర్యాప్తు అధికారులు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు సమాచారం, తీవ్రవాద ప్రచారం యువతను ఎలా మోసగించగలవో అని ఒక ఎన్ఐఏ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఒక యువకుడిని తన సొంత దేశంపైకి యుద్దం చేయించడానికి మార్పింగ్ చేసి సవరించి, తప్పుదారి పట్టించే సమాచారం సరిపోతుందో చూసి మేము ఆశ్చర్యపోయాము’’ అని ఒక అధికారి అన్నారు. అఖ్లతూర్ ఐదు రోజుల ఎన్ఐఏ కస్టడీ తరలించారు. అతని విదేశీ హ్యండ్లర్లు, స్థానిక గల వ్యవస్థకు సంబంధించి మరింత సమాచారం సేకరించడానికి క్షణ్ణంగా విచారించనున్నారు.