రామేశ్వరం కెఫె: నలుగురు అనుమానితుల అరెస్ట్

రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడులో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి రహస్యంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Update: 2024-03-02 09:57 GMT

బెంగళూర్ లోని రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపాయి. ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ధార్వాడ్, హుబ్బల్లి, బెంగళూర్ నుంచి నలుగురు అనుమానితుల తీసుకొచ్చి రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

బెంగళూర్ సిటీ కమిషనర్ బీ దయానంద్ మీడియాతో మాట్లాడుతూ.. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు లో ఐఈడీ ని వాడినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోందని చెప్పారు. పేలుడులో గాయపడిన పదిమంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంటున్నట్లు తెలుస్తోంది. " ఇప్పటిదాకా దొరికిన ఆధారాల ప్రకారం కొన్ని టీములు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. కేసు సున్నిత అంశాలతో ముడిపడి ఉండడంతో పాటు భద్రతా పరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అనవసర ఊహగానాలు ప్రసారం చేయద్దు" అని దయానంద్ కోరారు.
రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడుతో బెంగళూర్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కెంపెగౌడలోని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఐటీ కారిడార్ లో భద్రతను పెంచారు.
నిందితుడి ఫొటో విడుదల
రామేశ్వరం కెఫెలో పేలుడుకు పాల్పడిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరగడానికి ముందు తలకు క్యాప్, ఫేస్ మాస్క్, భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఓ అనుమానితుడు వచ్చి బ్యాగ్ అక్కడ వదిలి వెళ్లాడు. తరువాత దానికి టైమర్ ఫిక్స్ చేసి వెళ్లిపోయాడు. ఆ కొద్దిసేపటికే అక్కడ పేలుడు సంభవించింది. పేలుడు కోసం ప్రేషర్ కుక్కర్ ను వాడినట్లు తెలుస్తోంది. బెంగళూర్ పోలీసులు దీనికోసం కఠినమైన యూఏపీఏ చట్టంతో పాటు, పేలుడు పదార్థాల నిల్వ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags:    

Similar News