కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీపై న్యాయవిచారణ

ఆర్సీబీ తొక్కిసలాటపై ఏకసభ్య కమిషన్ విచారణ, ఈ రెండింటి నిర్లక్ష్యం వలనే 11 మంది మరణించారని నివేదిక?;

Update: 2025-07-12 11:04 GMT

ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత జరిగిన తొక్కిసలాట, 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కారణమని జస్టిస్ మైఖేల్ డి కున్హా నేతృత్వంలోని జ్యూడీషియల్ కమిషన్ నివేదిక పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు పూర్తి చేసిన జస్టిస్ డికున్హా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.

ఆర్సీబీ తొందరపాటు నిర్ణయం..
ఆర్సీబీ తొందరపాటు నిర్ణయం, స్టేడియం దగ్గర కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. అభిమానుల రాకను సరిగా అంచనా వేయకుండా అదనపు పోలీసులు రప్పించడంలో విఫలం అయ్యారని, ఇదే విషాదానికి దారి తీసిందని తేల్చి చెప్పింది.
సీల్డ్ దర్యాప్తు నివేదికను జస్టిస్ డి కున్హా స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. జూన్ 4న జరిగిన తొక్కిసలాట సంఘటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఒక నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలని కోరింది.
ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్..
కమిషన్ ఈ కార్యక్రమం గురించి ప్రజల అభిప్రాయాలు, ప్రకటనలను కోరింది. తుది నివేదికను సమర్పించే ముందు వివిధ రాష్ట్ర విభాగాల అధికారులు, కార్యక్రమ నిర్వాహకులను ప్రశ్నించింది.
జూన్ 3న అహ్మాదాబాద్ లో పంజాబ్ కింగ్స్, ను ఓడించి ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకుంది. 18 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. విజయం తరువాత ఆర్సీబీ మరుసటి రోజు బెంగళూర్ లో విక్టరీ పరేడ్ ప్రకటించింది.
Tags:    

Similar News