‘ఈ పోరాటం తెలంగాణ కోసం కాదు’

బీసీ బిల్లుపై రాష్ట్రపతి స్పందిస్తారని భావిస్తున్నాన్న రాహుల్ గాంధీ.;

Update: 2025-08-06 15:03 GMT

ఢిల్లీలో జంతర్‌ మంతర్ కూడలిలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పూర్తి మద్దతు పలికారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒకటే వైఖరి అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆయన తన మద్దతు తెలిపారు. తెలంగాణ బీసీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే అదొక గొప్ప ముందడుగు అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి నుంచి స్పందన వస్తుందని భావిస్తున్నా. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసం కాదు. అణగారిన వర్గాలందరి కోసం. ఈ ధర్నాకు హాజరైన ఇండి కూటమి నేతలందరికీ ధన్యవాదాలు.

రేవంత్ పేరు చరిత్రలో నిలుస్తుంది: సుప్రియ

కాంగ్రెస్ ధర్నాలో మహారాష్ట్ర ఎంపీ సుప్రియ సూలే పాల్గొని తన మద్దతు తెలిపారు. ‘‘వంచితులు, పీడితుల తరపున రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. దేశంలో తొలిసారి 69 శాతం రిజర్వేషన్లను కరుణానిధి అమలు చేశారు. అంబేద్కర్ మాదిరిగానే కరుణానిధి పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా చిరస్థాయిగా నిలుస్తుంది. కాంగ్రెస్‌తో శరద్ పవార్‌కు మంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్ మా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని సుప్రియ స్పష్టం చేశారు.

రేవంత్ సర్కార్‌కు అన్ని స్థాయిల్లో మద్దుతిస్తాం: కన్నెమొళి

కాంగ్రెస్ ధర్నాలో తమిళనాడు నేత కన్నెమొళి పాల్గొని తన మద్దతు ప్రకటించారు. ఇదే తమ పార్టీ స్టాన్స్ కూడా అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో తమ పార్టీ అన్ని స్థాయిల్లో మద్దతు ఇస్తుందని ఆమె ప్రకటించారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం అభివృద్ధిని అడ్డుకుంటోంది. ప్రజల యోగక్షేమం కోసం మేము ఎప్పుడూ మద్దతుగా ఉంటాం. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలి. తరతరాలుగా వెనకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఉంది. దేశంలో పోరాటం చేసి రిజర్వేషన్లు పెంచుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఈ అంశంపై పార్లమెంటులో కూడా తెలంగాణ ఎంపీలకు డీఎంకే మద్దతుగా ఉంటుంది’’ అని ఆమె తెలిపారు.

Tags:    

Similar News