పదో తరగతిలో గురుకులాలే టాప్
బాలికల్లో ఉత్తీర్ణత 94.26శాతంగా ఉండగా బాలురలో 31.32శాతంగానే ఉంది. గురుకుల పాఠశాలల్లో 98.7శాతం ఉత్తీర్ణత ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21శాతం విద్యార్థులు పాసయ్యారు.;
తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.78శాతం మంది విద్యార్తులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణ 1.47శాతం పెరిగింది. పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. బాలికల్లో ఉత్తీర్ణత 94.26శాతంగా ఉండగా బాలురలో 31.32శాతంగానే ఉంది. గురుకుల పాఠశాలల్లో 98.7శాతం ఉత్తీర్ణత ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21శాతం విద్యార్థులు పాసయ్యారు. ఎస్ఎస్‌సీ బోర్డు మార్కులు, గ్రేడ్‌లను సబ్జెక్ట్‌ల వారీగా విడుదల చేసింది.
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 16గా నిర్ణయించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు మే 15వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
ఒక్క విద్యార్థీ పాస్ కాని పాఠశాలలు రెండు
ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.29శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. వికారాబాద్‌లో అతి తక్కువగా 73.97శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సంవత్సరము 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినవి. ఈ సంవత్సరము 02 పాఠశాలలు సున్నా శాతము ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో మహబూబాబాదు జిల్లా అన్ని జిల్లాల కంటే 99.29 % ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉన్నది. అదే విధముగా వికారాబాదు జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 73.97% సాధించి చివరి స్థానములో ఉన్నది.
పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణతలో మహబూబాబాద్ టాప్‌లో ఉంది. ఈ జిల్లాలో విద్యార్థుల ఉత్తీర్ణత 99.29 శాతంగా ఉంది. రెండో స్థానంలో 99.09శాతంగా సంగారెడ్డి, 98.81శాతం ఉత్తీర్ణతతో జనగామ, 98.20 శాతంతో జగిత్యాల వరుసగా ఉన్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,96,374 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,60,519 మంది ఉత్తీర్ణులయ్యారు.