ఉప్పల్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడి హత్యాచారం
బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి ఘాతుకానికి పాల్పడిన నిందితుడు.;
ఉప్పల్‌లో ఘోరం జరిగింది. ఐదేళ్ల బాలుడిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బిస్కెట్ల ఆశ చూపించే బాధిత బాలుడిని నిందితుడు కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి బాధిత బాలుడి తండ్రితో కలిసి పనిచేసే వ్యక్తే అని కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చలకు దారితీసింది.
అయితే ఆగస్టు 12న మనోజ్ పాండే(బాధితుడు) కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆగస్టు 15న ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోజు రాత్రి పోలీసులకు కనిపించకుండా పోయినా మనోజ్ మృతదేహం లభ్యమయింది. అనంతరం మృతదేహం మనోజ్‌దే అని నిర్ధారించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం దేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు వేగం కూడా పెంచారు. సీసీకెమెరాల ఫుటేజీని పరిశీలించగా నిందితుడు మనోజ్ తండ్రితో కలిసి పనిచేసే వ్యక్తి కమర్ అని పోలీసులు గుర్తించారు.
మనోజ్ తండ్రి ఓ టింబర్‌లో పనిచేస్తారు. అదే టింబర్‌లోనే కమర్ కూడా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 12న మనోజ్‌కు బిస్కెట్ల ఆశచూపి కమర్ కిడ్నాప్ చేశాడని సీసీటీవీల ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. మనోజ్‌ది హత్యాచారంగా తెలుసుకున్న పోలీసులు నిందితుడు కమర్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు కఠినంగా శిక్షించాలని మనోజ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కమర్.. తమ పిల్లలో ఆడుకుంటుండేవాడని.. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము కలలో కూడా ఊహించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
‘‘ఆగస్టు 12న నా కుమారుడు మనోజ్ పాండే కనిపించకుండా పోయాడు. అన్ని చోట్ల వెతికినా అతడి జాడ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాం. వాళ్లు సీసీటీవీ కెమెరాల రికార్డింగ్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అందులో మనోజ్‌కు కమర్ తీసుకెళ్తుండటాన్ని గుర్తించాం. ఆగస్టు 15 రాత్రి మనోజ్ మృతదేహం లభ్యమయిందని పోలీసుల నుంచి సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి చూశాం. అది మా కొడుకు మృతదేహమే. నా కొడుకును కమరే చంపేశాడు. మాది ఛత్తీస్‌గఢ్.. రెండు నెలల క్రితం రామంతపూర్ కేసీఆర్ నగర్‌కు వచ్చాం. కమర్ కూడా నాతోపాటే టింబర్ డిపోలో పనిచేసేవాడు. సీసీ టీవీ ఫుటేజీ చూసేవరకు మాకు కమర్‌పై అనుమానం రాలేదు. మనోజ్ కనిపించకుండా పోయిన రోజు కమర్ మాతోనే ఉన్నాడు. అతడు మాతో కలిసిమెలిసి ఉండేవాడు. పిల్లలో ఆడుకునేవాడు. అతడు ఇలాంటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదు’’ అంటూ మనోజ్ తండ్రి ఈశ్వర్ కన్నీరుమున్నీరయ్యారు.