హనీట్రాప్ లో చిక్కుకున్న రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి

రూ 38. 73 లక్షలు పోగొట్టుకుని...;

Update: 2025-06-18 14:21 GMT

ఎంత వారైనా కాంతదాసులే. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు నేరగాళ్లు హనీ ట్రాప్ కు పాల్పడుతున్నారు. హైద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వో ద్యోగి హనీ ట్రాప్ కు చిక్కాడు. 38 లక్షల 73 వేలు పోగొట్టుకున్నాడు.

సదరు వ్యక్తికి ఓ యువతి ఫేస్ బుక్ లో పరిచయమైంది. తన తండ్రి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడని, టైలరింగ్ చేసి మా అమ్మ పోషిస్తున్నట్లు చెప్పుకుంది. చాటింగ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరమని, కేబుల్ ఆపరేటర్ నెంబర్ ఇచ్చి అతనికి పదివేలు ట్రాన్స్ ఫర్ చేయించింది.

యువతి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కేబుల్ ఆపరేటర్ ను బాధితుడు ఆరా తీశాడు. మీరు డబ్బు పంపినందుకు థాంక్స్ చెబుతూనే కేబుల్ ఆపరేటర్ ఓ కొత్త ట్విస్టు ఇచ్చాడు. సదరు మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో ఎమర్జన్సీ వార్డులో చికిత్సలో పొందుతున్నట్టు నమ్మబలికాడు. వెంటనే వృద్దురు మరో రూ 10 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. డి శ్చార్జి చేయడానికి మరో రూ 2.65 లక్షలు అవసరమని చెప్పడంతో తన క్రెడిట్ కార్డు నుంచి ట్రాన్స్ ఫర్ చేశాడు ఆ వృద్దుడు.

కొన్ని రోజుల తర్వాత ఆ యువతి గూర్చి ఆరా తీస్తే కేబుల్ ఆపరేటర్ మరో కహానీ చెప్పాడు. అర్జెంట్ గా దుబాయ్ వెళ్లాల్సి రావడంతో వెళ్లిపోయినట్లు బుకాయించాడు. తన తల్లి, చెల్లి మీ తో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు కేబుల్ ఆపరేటర్.

ఆ వృద్దుడు తల్లి, చెల్లితో అసభ్యంగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. కేబుల్ ఆపరేటర్ మరో ట్విస్ట్ తో రంగంలో దిగాడు. తల్లి, చెల్లిని లైంగికంగా వేధించినందుకు పోలీస్ కేసు బుక్ అయ్యిందని, కానిస్టేబుల్ తో విషయం సెటిల్ చేసుకోవాలన్నాడు సదరు కేబుల్ ఆపరేటర్.

కానిస్టేబుల్ కు లక్ష లంచం ఇస్తే ఎస్ఐ కేసు కొట్టేస్తాడని చెప్పాడు కేబుల్ ఆపరేటర్ లక్ష రూపాయలు సమర్పించుకున్న వృద్దుడు కాస్త రిలీఫ్ అయ్యాడు. ఇంతలో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. కొత్తగా ఎస్ఐ వచ్చినట్లు , ఈ కేసును ఆయనే డీల్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. మరో రూ 10 లక్షలు ఇస్తే కేసు కొట్టివేస్తానన్నాడు.

వృద్దుడు రూ 7 లక్షలతో ఇష్యూను సెటిల్ చేసుకున్నాడు. టోటల్ గా రూ38.73 లక్షలను రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి సమర్పించుకోవాల్సి వచ్చింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వృద్దుడు తన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తో పాటు సర్వీసులో సంపాదించిన ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు.

Similar News