SLBC టన్నెల్‌‌లో 8 మంది మృతదేహాలను గుర్తించాం, ఎమ్మెల్యే వంశీ కృష్ణ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృత్యువాత పడ్డారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రకటించారు.;

Update: 2025-03-01 07:26 GMT

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ కూలిపోయిన ప్రమాదంలో లోపల చిక్కుకున్న 8 మంది మరణించారని స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నగుర్‌జీత్‌ సింగ్‌(పంజాబ్‌), సన్నీత్‌సింగ్‌ (జమ్ముకశ్మీర్‌), శ్రీనివాసులు (యూపీ), మనోజ్‌ రూబెన (యూపీ), సందీప్‌ (ఝార్ఖండ్‌), సంతోష్‌ (ఝార్ఖండ్‌), జట్కా,హీరాన్‌ (ఝార్ఖండ్‌)లు మరణించారని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ టన్నెల్ వద్ద మీడియా ముందు ప్రకటించారు.


మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తాం
టన్నెల్ కూలిపోయిన ఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. టన్నెల్ లో ఉన్నవారి మృతదేహాలను గుర్తించామని ఆయన తెలిపారు.చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తుందన్నారు. మృతదేహాలను వెలికి తీసిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.మృతుల కుటుంబాలకు కంపెనీ, ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని ఆయన చెప్పారు. మృతులకు బీమా త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు.


Tags:    

Similar News