కొణిజేటి రోశయ్యకు అరుదైన గౌరవం

సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎవరికీ ఇపుడు రోశయ్యకు దక్కిన గౌరవం దక్కలేదు.;

Update: 2025-07-02 06:45 GMT
Konijeti Rosaiah

సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్యకు తెలంగాణ ప్రభుత్వంలో అరుదైన గౌరవం లభించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎవరికీ ఇపుడు రోశయ్యకు దక్కిన గౌరవం దక్కలేదు. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రికి దక్కిన అరుదైన గౌరవం ఏమిటంటే జూలై 4వ తేదీని రోశయ్య జయంతిగా నిర్వహించాలని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. జూలై 4వ తేదీ రోశయ్య జన్మదినం. ఇప్పటివరకు పనిచేసిన కొందరు సీఎంల జన్మదినాన్ని జయంతిగా పార్టీలు జరుపుకుంటున్నాయి. మరికొందరి జయంతిని కుటుంబసభ్యులు లేదా అభిమానులు జరుపుకుంటున్నారు. అలాంటిది రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటం కచ్చితంగా అరుదైన గౌరవం అనే చెప్పాలి.

రోశయ్య జయంతిని అన్ని జిల్లాల్లో ఘనంగా జరిపేందుకు కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో జయంతి రాష్ట్రమంతా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ధికశాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా రోశయ్య(Konijeti Rosaiah)కే దక్కుతుంది. హైదరాబాద్(Hyderabad) లోని ధరమ్ కరమ్ ఏరియాలో మాజీ సీఎం ఉండేవారు. అందుకని ఈ ఏరియాలోని ఒక వీధికి రోశయ్య పేరు పెట్టాలని గ్రేటర్ మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఆయన ఇంటికి దగ్గరలోనే ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టబోతున్నది ప్రభుత్వం. లక్డీకాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది.

రోశయ్య సుమారు 50 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నా వివాదరహితుడిగా పేరు పొందారు. అన్నీ పార్టీల్లోను ఈయనకు అత్యంత సన్నిహితులున్నారు. ప్రతిపక్షాల్లోని నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రులను ఎంతగా విమర్శించినా, ఆరోపణలు చేసినా రోశయ్య విషయంలో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడేవారు. సమైక్య ఏపీకి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు(Tamilnadu) గవర్నర్ గా కూడా పనిచేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధ్యక్షుడిగా అంతకుముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. నిజానికి ఇపుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సుంది. అయితే ఏ రాజకీయాలు అడ్డొచ్చాయో కాని చంద్రబాబునాయుడు(Chandrababu), వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ఇద్దరూ రోశయ్యను పట్టించుకోలేదు.

K

Tags:    

Similar News