అక్రమాస్తుల కేసులో అదనపు కలెక్టర్.. సోదాలు చేసిన ఏసీబీ

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇల్లు సహా ఆయన సంబంధించి ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు.

Update: 2024-10-22 11:33 GMT

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇల్లు సహా ఆయన సంబంధించి ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో ఆయన ఇల్లు, కార్యాలయాలు సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే భూమాల్ రెడ్డిపై రూ.5 కోట్ల అక్రమాస్తుల కేసును రిజిస్టర్ చేశారు అధికారులు. ఆయన ఆదాయానికి, ఉన్న ఆస్తులకు ఏమాత్రం సంబంధం లేదన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భూపాల్ రెడ్డి దగ్గర రూ.5,05,71,676 విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో రూ.4,19,40,158 విలువైన ఆస్తులను ఆయన తన అక్రమ సంపాదన ద్వారానే కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ధరలు మొత్తం కూడా డాక్యుమెంట్ల ప్రకారం చెప్పబడినవేనని, సదరు ఆస్తుల మార్కెట్ విలువ చూస్తే ఇది చాలా అధిక మొత్తంలో ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారుల నుంచి అందుతున్న సమాచారం.

తెలంగాణ భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ధరణి పోర్టల్‌కు చెందిన అవినీతి కుంభకోణం కేసులో భూపాల్ రెడ్డి సహా సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ పేర్లు కూడా వినిపించాయి. ఇదే కేసులో వారిని 13 ఆగస్టు 2024న అరెస్ట్ చేశారు. గుర్రంగూడ క్రాస్‌రోడ్డు దగ్గర స్థానిక నివాసి జక్కిడి ముత్యం రెడ్డి నుంచి రూ.8 లక్షల లంచం తీసుకకుంటూ మదన్ మోహన్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ధరణి పోర్టల్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించడం కోసమే అతడు ఈ లంచం తీసుకున్నట్లు అధికారుల విచారణ తేలింది. కాగా ఈ విధంగా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి తరపునే మదన్ మోహన్ ఈ పనులు చేస్తున్నట్లు విచారణలో స్పష్టమైంది. ఫోన్ సంభాషణ సహా పలు ఆధారాలతో ఈ విషయం తేటతెల్లమైంది.

ఆ తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారం.. అదే రోజు సాయంత్రం సమయంలో తన అధికారిక వాహనంలో మదన్ మోహన్.. భూపాల్ రెడ్డికి ఆ లంచం మొత్తాన్ని అందించాడు. కాగా అప్పటికే అంతా రెడీగా ఉన్న అధకారులు.. వెంటనే రంగంలోకి దిగి ఆ నగదుకు పరీక్షలు చేయగా.. ఫినాల్‌ఫ్తలిన్ పాజిటివ్‌గా తేలింది. ఈ కేసులో భూపాల్ రెడ్డి, మదన్ మోహన్ ఇద్దరూ కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని స్ఫష్టమైంది. లంచం, ఆదాయానికి మించిన కేసులో వీరి పాత్రలకు సంబంధించే ఈరోజు భూపాల్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు.




 

అడ్డంగా దొరికన మున్సిపల్ కమిషనర్

ఇదిలా ఉంటే.. పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ బిల్లులను క్లియర్ చేయడానికి రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్. దీంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ప్లాన్ ప్రకారం.. లంచం తీసుకుంటుండగా నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

Tags:    

Similar News